CM Stalin: డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌కు అనుకోని అదృష్టం.. ఏకంగా సీఎం స్టాలిన్‌ను..

|

Jul 09, 2022 | 10:59 AM

Vignesh Shivan: నేనూ రౌడీనే, గ్యాంగ్‌, కేఆర్‌కే లాంటి డబ్బింగ్‌ సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan). ఇటీవలే నయనతారతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించాడు. ఇదిలా ఉంటే ఈ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌కి

CM Stalin: డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌కు అనుకోని అదృష్టం.. ఏకంగా సీఎం స్టాలిన్‌ను..
Stalin Vignesh
Follow us on

Vignesh Shivan: నేనూ రౌడీనే, గ్యాంగ్‌, కేఆర్‌కే లాంటి డబ్బింగ్‌ సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan). ఇటీవలే నయనతారతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించాడు. ఇదిలా ఉంటే ఈ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌కి అనుకోని అదృష్టం తలుపు తట్టింది. ఇప్పటి వ‌ర‌కు సినిమా హీరోల‌ను డైరెక్ట్ చేస్తూ వ‌చ్చిన అతను ఈసారి ఏకంగా త‌మిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ (MK Stalin)ను డైరెక్ట్‌ చేశాడు. అదేంటి.. పాలనా వ్యవహరాలతో నిత్యం బిజిబిజీగా ఉండే సీఎం ఏ సినిమాలో నటిస్తున్నారు? అని అనుకుంటున్నారా? అయితే ఇది సినిమా కాదు.. చెన్నైలో జులై 28 నుంచి ఆగ‌స్ట్ 10 వ‌ర‌కు చెస్ ఒలింపియాడ్ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. 186 దేశాల‌కు చెందిన సుమారు 2 వేల మంది చెస్ క్రీడాకారులు ఈపోటీలకు హాజరుకానున్నారు.

చెస్‌ పోటీల కోసం..

ఈక్రమంలో పోటీలను త‌మిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కోసం ఓ స్పెషల్‌ వీడియోను రూపొందించాల‌ని ప్రభుత్వం భావించింది. ఆ బాధ్యతలను విఘ్నేష్ శివ‌న్‌కు అప్పగించింది. ఈ వీడియోలో సీఎం స్టాలిన్‌ కూడా నటించారు. తాజాగా చెన్నైలో నేపియార్ దగ్గర ఆయనపై కొన్ని స‌న్నివేశాల‌ను షూట్‌ చేశారు. ఈ వీడియోకు ఆస్కార్ విజేత ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్వరాలు సమకూర్చడం విశేషం. కాగా కాదువాకుల రెండు కాదల్‌ మూవీ తర్వాత విఘ్నేశ్‌ అజిత్‌కుమార్ తో ఓ సినిమా తెరకెక్కి్స్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి పూర్త వివరాలు వెల్లడికానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..