Actor GiriBabu: ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూత..! తెలుగు సినీ పరిశ్రమలో విషాదం..!
నటుడు గిరిబాబు కన్నుమూశారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. 80ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు గిరిబాబు. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గిరిబాబు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు

నటుడు గిరిబాబు కన్నుమూశారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. 80ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు గిరిబాబు. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గిరిబాబు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబు.. 1973లో ‘జగమే మాయ’ చిత్రంతో విలన్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.
తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారు. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గిరిబాబు మరణం సినీ రంగానికి తీరని లోటుగా నిలవనుంది.
