AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి ఆ సీరియల్ హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బ్యూటీ కామెంట్స్ పై నెటిజన్స్ రియాక్షన్స్.

బిగ్ బాస్ సీజన్ 10... ఇప్పటికే డబుల్ ఎలిమినేషన్ అయిపోయింది. మొదటి వారంలోనే మిడ్ ఎలిమినేషన్ అని చరణ్.. ఆ తర్వాత చైత్ర ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు బిగ్ బాస్. అయితే ఇఫ్పుడు హౌస్ లోకి మరో క్రేజీ బ్యూటీ ఎంట్రీ ఇవ్వనుంది. బుల్లితెరపై చాలా ఫాలోయింగ్ ఉన్న ఈఅమ్మడు హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది.

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి ఆ సీరియల్ హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బ్యూటీ కామెంట్స్ పై నెటిజన్స్ రియాక్షన్స్.
Bigg Boss 10 Telugu
Rajitha Chanti
|

Updated on: Sep 12, 2026 | 1:03 PM

Share

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు 10’ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీలు, కామనర్స్ కలయికతో ప్రారంభమైన ఈ సీజన్ తొలి రోజు నుంచే ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. షో ప్రారంభమైన మొదటి వారంలోనే డబుల్ ఎలిమినేషన్‌తో చైత్ర రాయ్, చరణ్‌లు హౌస్ నుంచి బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హౌస్‌లో బలమైన పోటీని పెంచేందుకు నిర్వాహకులు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే వారి లిస్టులో ప్రముఖ బుల్లితెర నటి కావ్యశ్రీ పేరు గట్టిగా వినిపిస్తోంది.

ఎక్కువమంది చదివినవి : ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. చివరకు చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.. ప్రేమ కన్నీళ్లు..

కన్నడ రంగానికి చెందిన కావ్యశ్రీ ‘కోయిలమ్మ’, ‘గువ్వా గోరింకా’, విశేష ప్రజాదరణ పొందిన ‘గోరింటాకు’ వంటి తెలుగు సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇటీవల చెఫ్ మంత్ర కార్యక్రమంలో బిగ్‌బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీ వార్తలపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ టీమ్ నుంచి తమకు ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనని, వారితో చర్చలు జరుగుతున్నాయని కావ్యశ్రీ స్పష్టం చేశారు. అయితే, ఇప్పటివరకు ఈ ఆఫర్‌ను ఇంకా అంగీకరించలేదని తెలిపారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాలా లేదా అనేది కుటుంబ సభ్యుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. “మా కుటుంబ సభ్యుల అనుమతి ఉంటేనే నేను బిగ్‌బాస్‌కి వెళ్తాను. నా జీవితంలో వాళ్లే అత్యంత ముఖ్యం. భవిష్యత్తులో ఈ షోకి వెళ్లవచ్చు లేదా వెళ్లకపోవచ్చు, ప్రస్తుతానికైతే కచ్చితంగా ఏమీ చెప్పలేను” అని ఆమె తేల్చిచెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Allari Naresh: అతడు ఒక కంప్లీట్ యాక్టర్.. డైలాగ్స్, ఫైట్స్ అన్నీ అద్భుతంగా చేస్తాడు.. అల్లరి నరేష్.

అంతేకాకుండా, తనకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ ఆదరిస్తున్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. బిగ్‌బాస్ 10 గురించి కావ్యశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఏడాదిలో 80 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్..

కావ్య శ్రీ..

ఎక్కువమంది చదివినవి : Brahmaji : అన్నం పెట్టిన ఋణం తీర్చుకోవడానికి ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు.. నటుడు బ్రహ్మాజీ..

Follow Us