Teja Sajja: గ్రాండ్‏గా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం.. టాలీవుడ్ స్టార్స్ సందడి.. అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదే..

హీరో తేజ సజ్జా నిశ్చితార్థం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఘనంగా జరిగింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, చిరంజీవి, రవితేజ, రానా వంటి ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. సినీ పరిశ్రమ నుంచి రవితేజ, రానా దగ్గుబాటి సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నాని, శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు హాజరయ్యారు..

Teja Sajja: గ్రాండ్‏గా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం.. టాలీవుడ్ స్టార్స్ సందడి.. అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదే..
Teja Sajja Engagement

Updated on: Nov 16, 2026 | 3:19 PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తేజ సజ్జా. ఇప్పటివరకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా, ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో భాగంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రత్యేక అతిథిగా విచ్చేసి తేజ సజ్జా దంపతులను ఆశీర్వదించారు. గవర్నర్‌తో పాటు పలువురు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటంతో మెగా అభిమానులు, సినీ ప్రేమికులు ఈ యంగ్ హీరోకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

తేజా సజ్జా నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, రానా దగ్గుబాటి, శివాజీ, నాని, శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా వేడుకలో పాల్గొన్నారు.ఈ ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌లో వీరి వివాహం జరగనుంది. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సన్నిహితులు తెలిపారు. పెళ్లికి అతి దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారని చెబుతున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ సన్నిహితుల కోసం రిసెప్షన్ నిర్వహిస్తారని సమాచారం.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..

ఇదిలా ఉంటే తనకు కాబోయే భార్య గురించి తేజ సజ్జా ఇదివరకే స్వయంగా వివరాలు వెల్లడించారు. ఆమెకు సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. ఆమె ఓ వ్యాపార కుటుంబానికి చెందిన యువతి. అమెరికాలో పెరిగారని కూడా చెప్పారు. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని, తల్లిదండ్రులే నిశ్చయించారని వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

తేజా సజ్జా..

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us