తెలుగు నవలని కొనుగోలు చేసిన హాలీవుడ్‌ సంస్థ

|

Oct 07, 2020 | 7:24 AM

సుప్రసిద్ద తెలుగు రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల 'ఆనందో బ్రహ్మ'..త్వరలో సినిమాాగా తెరకెక్కబోతుంది.

తెలుగు నవలని కొనుగోలు చేసిన హాలీవుడ్‌ సంస్థ
Follow us on

సుప్రసిద్ద తెలుగు రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ‘ఆనందో బ్రహ్మ’..త్వరలో సినిమాాగా తెరకెక్కబోతుంది. ఇందుకు సంబంధించిన రైట్స్‌ను అమెరికాలో స్థిరపడ్డ తెలుగు దర్శక, నిర్మాత మేక‌ ముక్తేశ్‌ రావు కొనుగోలు చేశారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మూడు హాలీవుడ్ చిత్రాలు నిర్మిస్తోన్న ఆయన.. ‘ఆనందో బ్రహ్మ’ నవలను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. 1729 పిక్చ‌ర్స్ హాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ మీద‌ ఈ సినిమాను ఆయన నిర్మించనున్నారు. మనుషుల మధ్య సంబంధాలను, ఆత్మీయానుబంధాలను పలికించిన ఈ నవల త్వరలో సినిమా రూపంలో ప్రేక్షకులను  అలరించనుంది. ఈ సందర్భంగా యండమూరి ఆనందం వ్యక్తం చేస్తూ.. ముక్తేశ్ రావుకు అభినందనలు తెలిపారు.

కథ ఏంటంటే?

పట్నం వచ్చిన ఓ  పల్లెటూరి యువకుడికి గర్భిణి ఆదరిస్తుంది. వారిద్దరి మధ్య ఉన్నది ఏంటి? ప్రేమా? ఆకర్షణా? వ్యామోహమా? అనుబంధమా?  అనే కథనంతో యండమూరి ఈ నవల రాశారు. ఆత్మీయానుబంధాల కలబోత గల ఈ నవలను అధునాతన టెక్నాలజీతో ముక్తేశ్‌ రావు స్క్రీన్​పై చూపించేందుకు రెడీ అయ్యారు. (రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి )