Balakrishna: ఆ డైరెక్టర్‌తో సినిమా చేయడమంటే బాలకృష్ణకు చాలా ఇష్టం.. కానీ.! ఎందుకు చేయలేదంటే
దర్శకుడు రవిబాబు.. వెర్సాటాలిటీకి పెట్టింది పేరు. ఆయన సినిమాలన్నీ కూడా కొంచెం కొత్తగా.. ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక టాలీవుడ్ నటుడు కాశీ విశ్వనాథ్.. దర్శకుడు రవిబాబుతో తన ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ నటుడు కాశీ విశ్వనాథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలో తన ప్రయాణం, దర్శకుడు రవిబాబుతో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరో వెంకటేష్ షూటింగ్ సమయంలో ఎంత క్రమశిక్షణతో ఉంటారో ఆయన వివరించారు. వెంకటేష్ షాట్‌కు వెళ్లే ముందు అద్దంలో చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తారని.. ఆయన ప్రైవేట్ స్పేస్‌లోకి తనను కూడా అనుమతించేవారని కాశీ విశ్వనాథ్ గుర్తు చేసుకున్నారు. ‘కలుసుందాం రా’ సినిమాలో వెంకటేష్‌తో చేసిన ఎమోషనల్ సీన్ తనకు వ్యక్తిగతంగా ఎంతో గుర్తింపు తెచ్చిందని చెప్పారు.
ఇది చదవండి: అందుకే శ్రీదేవి నాకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి
కాశీ విశ్వనాథ్ కెరీర్‌ను మలుపు తిప్పిన వ్యక్తి రవిబాబు. ఇది ఆయనే స్వయంగా చెప్పారు. వాస్తవానికి కాశీ విశ్వనాథ్ ఒక దర్శకుడైనప్పటికీ, ఆయనలోని నటుడిని రవిబాబు గుర్తించి ‘నచ్చావులే’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. ఆ చిత్రంలోని కీలకమైన సీన్ల కోసం రవిబాబు తనతో ఎంతో పట్టుదలతో పని చేయించారని, ఆ కృషి వల్లే తనకు నటుడిగా మంచి పేరు వచ్చిందని తెలిపారు. నటుడిగా మారడం అనేది పూర్వజన్మ సుకృతం అని గతంలో బాలకృష్ణ అన్న మాటలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రవిబాబు అడిగినప్పుడు కుటుంబ సభ్యులు మొదట వారించినా, ఆయనపై ఉన్న నమ్మకంతోనే నటన వైపు అడుగులు వేశానని విశ్వనాథ్ స్పష్టం చేశారు.
రవిబాబు పనితీరు గురించి మాట్లాడుతూ.. ఆయన ఏ విషయంలోనూ రాజీపడని దర్శకుడని కాశీ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు. ‘అల్లరి’, ‘నచ్చావులే’ లాంటి సినిమాల్లో ఆయన చూపించిన విభిన్నమైన శైలి, హాస్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయని తెలిపారు. అయితే, రవిబాబు నుంచి మరిన్ని సినిమాలు వచ్చి ఉంటే బాగుండేదనే చిన్న అసంతృప్తిని కూడా ఆయన వ్యక్తం చేశారు. రవిబాబుకు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడియాలజీ ఉందని, అది ఆయనను ఒక విభిన్నమైన దర్శకుడిగా నిలబెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.
బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్ హీరోలు రవిబాబుతో సినిమా చేయాలని అడిగినా ఎందుకు కుదరలేదనే విషయంపై కూడా కాశీ విశ్వనాథ్ క్లారిటీ ఇచ్చారు. రవిబాబు సెట్‌లో ఒక ‘డిక్టేటర్’ లాగా తన ఆలోచనల ప్రకారమే పని చేయడానికి ఇష్టపడతారని, ఎక్కడా రాజీపడరని చెప్పారు. పెద్ద హీరోలతో సినిమా చేసేటప్పుడు రవిబాబు తన శైలిని మార్చుకోవాల్సి వస్తుందని, అది ఆయనకు ఇష్టం లేకపోవడం వల్లే తన సొంత మార్కుతో చిన్న సినిమాలు చేసుకుంటున్నారని విశ్వనాథ్ వివరించారు. తన కెపాసిటీకి తగ్గట్టుగా, తనకున్న నిర్మాతలతో తనదైన శైలిలో కెరీర్‌ను నిర్మించుకోవడమే రవిబాబు ప్రత్యేకత అని ఆయన ముగించారు.
ఇది చదవండి: అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది.. ఎందుకంటే.?
