‘డ్యూడ్’ మూవీలో మమిత బాయ్‌ఫ్రెండ్ గుర్తున్నాడా? అతని చెల్లెలు ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్.. ఎవరంటే?

ఇప్పుడు ఈ హీరోయిన్ పేరు తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మ ఫొటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. గతంలో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఈ అమ్మడు ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.

డ్యూడ్ మూవీలో మమిత బాయ్‌ఫ్రెండ్ గుర్తున్నాడా? అతని చెల్లెలు ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్.. ఎవరంటే?
Riya Shibu

Updated on: Feb 09, 2026 | 7:58 PM

2025లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ కామెడీ సినిమా డ్యూడ్ . కీర్తిశ్వరన్ తెరెక్కించిన ఈ సినిమాలో . ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, నేహా శెట్టి , శరత్‌కుమార్, హృదు హరూన్, రోహిణి ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రదీప్, మమిత ల యాక్టింగ్ హైలెట్ అని చెప్పవచ్చు. అయితే ఇదే మూవీలో మరో క్యారెక్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అదే మమితను రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకునే పార్థు. ఈ పాత్రలో
హ్రిందు హరూన్ అద్భుతంగా నటించాడు. అమాయకమైన కుర్రాడి పాత్రలో అదరగొట్టేశాడు. డ్యూడ్ కంటే ముందు పలు సినిమాల్లో నటించాడు హరూన్. ముంబైకర్, బ్యాడ్ గర్ల్స్, థగ్స్ వంటి పలు హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో వివిధ పాత్రలు పోషించాడు.

అయితే ఇప్పుడు అతని చెల్లెలు పేరు కూడా దక్షిణాది సినిమా పరిశ్రమలో మార్మోగుతోంది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా ఒకటి ఇటీవల రిలీజై సంచలన విజయం సాధించింది. ఇందులో ఆమె అందం, అభినయం , ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు. తెలుగు నాట కూడా ఈ ముద్దుగుమ్మకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? సర్వం మాయ సినిమా హీరోయిన్ రియా షిబు అలియాస్ డెలులు.

ఇవి కూడా చదవండి

సర్వం మాయ హీరోయిన్ తో డ్యూడ్ యాక్టర్..

మలయాళంలో తెరకెక్కిన సర్వం మాయ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసిన వారందరూ రియా సెటిల్ట్‌ యాక్టింగ్‌, బ్యూటీఫుల్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో రియా గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ బ్యూటీ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రముఖ నిర్మాత షిబూ థామీన్స్‌ కూతురే ఈ రియా షిబు. అలాగే ‘డ్యూడ్‌’ సినిమాలో మమితా బైజుకు బాయ్‌ఫ్రెండ్‌గా నటించిన హ్రిదూ హరన్‌ రియాకు సోదరుడు అవుతాడు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోస్, వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి