Vijay-Rashmika: మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనున్న విజయ్- రష్మిక.. తాళి కట్టే శుభవేళ ఇదే!

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. గురువారం (ఫిబ్రవరి 26) ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో వీరి పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ గ్రాండ్ వెడ్డింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.

Vijay-Rashmika: మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనున్న విజయ్- రష్మిక.. తాళి కట్టే శుభవేళ ఇదే!
Wedding Of Virosh

Updated on: Feb 25, 2026 | 10:14 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరికొన్ని గంటల్లో కొత్త జీవితం ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు రీల్ లైఫ్ లో జంటగా కనిపించిన వీరు ఇకపై రియల్ లైఫ్ లోనూ భార్యభర్తలు కానున్నారు. వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో ఇప్పటికే విజయ్- రష్మికల పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 24) సంగీత్ జరగ్గా, బుధవారం (ఫిబ్రవరి 25) హల్దీ అట్టహాసంగా జరిగింది. ఇక గురువారం అంటే ఫిబ్రవరి 26న ఈ ప్రేమ జంట పెళ్లిపీటలెక్కనుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు వేదిక కానుంది. ఇప్పటికే ఈ పెళ్లి కోసం వధూవరులతో పాటు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు ఉదయ్ పూర్ ప్యాలెస్ లో దిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రష్మిక- విజయ్ ఏ సమయానికి పెళ్లి పీటలెక్కబోతున్నారో తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ జంటకు అత్యంత సన్నిహితులైన వర్గాలు అందించిన సమాచారం ప్రకారం..

 

ఇవి కూడా చదవండి

 

పెళ్లి వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం ఏడున్నర గంటలకు  బరాత్‌ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం రష్మిక- విజయ్ ల వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయ దేవరకొండ. ఆపై అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి రష్మిక- విజయ్ ల వివాహ వేడుక జరగనుంది. మొత్తానికి రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక ను గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

 

వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. హల్దీ ఫొటోస్ ఇదిగో…

 

ఇదిలా ఉంటే విజయ్- రష్మికల పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు. అలాగే కొందరు సినీ ప్రముఖులు కూడా రానున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us