
ఒక సినిమా కోసం దర్శకుడు ముందుగా ఒక హీరోను అనుకోవడం.. కథలో మార్పులు రావడంతో ఆ ప్రాజెక్ట్ మరో హీరో దగ్గరకు వెళ్లడం, లేదా ఆ హీరో బిజీగా ఉంటే మరో హీరోతో సినిమా చేయడం లాంటివి సినిమా రంగంలో కొత్తేమీకాదు. కానీ ఆ సినిమా పెద్ద స్టార్ నటించినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోతే ఈ విషయం మరింత చర్చకు వస్తుంది. మహేష్ బాబు నటించిన ఓ సినిమా విషయంలో ఇలాంటిదే జరిగిందట. మహేష్ చేసిన ఆ డిజాస్టర్ సినిమా ముందుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిందట.. ఆయన బిజీగా ఉండటంతో ఫైనల్ గా మహేష్ బాబు చేశారట.. కట్ చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్.. ఆ సినిమా మరేదో కాదు బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం 2016లో విడుదలైంది. కుటుంబ సంబంధాలు, బంధాలు, మనుషుల మధ్య అనుబంధాలను ప్రధానంగా తీసుకుని ఈ కథ రూపొందింది.
అయితే ఈ కథను మొదట జూనియర్ ఎన్టీఆర్‌కు చెప్పారట. దర్శకుడి మొదటి ఎంపిక ఎన్టీఆర్ అని, ఆయన కథలోని ఆలోచనను ఇష్టపడ్డప్పటికీ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు కోరారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తనకు నచ్చే విధంగా కొత్త డ్రాఫ్ట్ రావాలని ఎన్టీఆర్ ఎదురుచూశారని, అయితే ఆశించిన స్థాయిలో స్క్రిప్ట్ మార్పులు జరగకపోవడంతో చివరికి ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపించాయి. అదే సమయంలో ఆయన సుకుమార్ దర్శకత్వంలోని నాన్నకు ప్రేమతో పై దృష్టి పెట్టారు.
ఆ తర్వాత బ్రహ్మోత్సవం మహేష్ బాబు చేతికి వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవలేకపోయింది. అంతకు ముందు మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో బ్రహ్మోత్సవం సినిమాపై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ సినిమా రిలీజ్ తర్వాత రిజల్ట్ మరోలా ఉంది. అయితే బ్రహ్మోత్సవం వెనుక జూనియర్ ఎన్టీఆర్ పేరు మొదట వినిపించిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ అందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.