AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Enemy- Trailer: ‘నొప్పిని భరించే వాడే లైఫ్‌లో గెలవగలుగుతాడు’.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఎనిమి’ ట్రైలర్..

తమిళ్‌తోపాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు విశాల్ - ఆర్య ఇద్దరు. ఈ ఇద్దరి సినిమాలు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి.

Enemy- Trailer: 'నొప్పిని భరించే వాడే లైఫ్‌లో గెలవగలుగుతాడు'.. ఆసక్తి రేకెత్తిస్తున్న 'ఎనిమి' ట్రైలర్..
Enemy
Rajeev Rayala
|

Updated on: Oct 23, 2021 | 6:21 PM

Share

Vishal and Arya : తమిళ్‌తోపాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు విశాల్ – ఆర్య ఇద్దరు. ఈ ఇద్దరి సినిమాలు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. ఇక విశాల్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆర్యకు కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా విడుదల కానుంది. ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించారు. ఎనిమి అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గ నటిస్తున్నాడు. అలాగే ఆర్య నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. నోటా చిత్ర ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్య‌కు 32వ చిత్రం. ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరు హీరోలు కలిసి ‘వాడు వీడు’ అనే సినిమా చేశారు.

తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమాలో చూపించనున్నారు. అందులోనూ.. ఒకరు పోలీస్ మరొకరు క్రిమినల్ అయితే.. ఆ ఇద్దరి మధ్య పోరు ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. నొప్పిని భరించే వాడే లైఫ్‌లో గెలవగలుగుతాడు అని ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral News: బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారిన నటుడు రామిరెడ్డి.. తెలుగు దివంగత నటుడు అక్కడ ఎందుకనేగా..

RK Selvamani: దర్శకుడు సెల్వమణి బర్త్ డే వేడుకలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్..

Mahesh Babu: సర్కారు వారి పాటకు శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు.. సినిమా సెట్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ..

Follow Us
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు