చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు కంటెంట్ ఉంటే చాలు సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమాలు పాన్ ఇండియా హిట్స్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన విమానం సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మంచి కంటెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఓటీటీలో ఈ మూవీ దూసుకుపోతుంది. శివ ప్రసాద్ యానాల అనే దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. థియేటర్స్ లో విడుదలైన సమయంలో ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతుంది. జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. తాజాగా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.
ఓటీటీలో జూన్ 22న రిలీజ్ అయ్యింది విమానం మూవీ. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం గురించి అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో.. విమానం సినిమా ఏకంగా 50 మిలియన్స్ వ్యూవింగ్ మినిట్స్ తో దూసుకుపోతుంది ఈ సినిమా.