పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం అనే సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. బ్రో సినిమానుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే తాజాగా విడుదలైన మైడియర్ మార్కండేయ అనే సాంగ్ రిలీజ్ చేశారు. థమన్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ హడావిడి ఎక్కడా కనిపించడం లేదు అంటూ కొంతమంది ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ షూరూ చేశారు చిత్రయూనిట్.
తాజాగా పింపుల్ మీడియా ఫ్యాక్టరీ అందరినీ ఆకర్షించేలా ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది. ఈ ప్రమోషన్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. గోదావరి నదిలో బోట్లను బ్రో ఆకారంలో టైటిల్ ను హైలెట్ చేశారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ పోస్టర్స్ కూడా నదిలో ఉంచారు.
ఇక ఈ మూవీ ట్రైలర్ ను వచ్చే వారంలో విడుదల చేయనున్నారు. జూలై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా బ్రో మూవీని విడుదల చేయనున్నారు. అలాగే ఈ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సుబ్బరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.