తారక్‌కు విలన్‌గా సేతుపతి.. అన్నీ కుదిరితే రేర్ కాంబో.. రికార్డులు బద్దలు కావడం ఖాయం.!

|

Feb 23, 2021 | 7:56 AM

NTR And Vijay Sethupathi: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న..

తారక్‌కు విలన్‌గా సేతుపతి.. అన్నీ కుదిరితే రేర్ కాంబో.. రికార్డులు బద్దలు కావడం ఖాయం.!
Follow us on

NTR And Vijay Sethupathi: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో గిరిజన వీరుడు కొమరం భీంగా తారక్ కనిపించనున్నాడు. ఇక మూవీ తర్వాత తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ‘ఎన్టీఆర్ 30’గా వస్తోన్న ఈ సినిమాకు ‘అయినాను పోయిరావలెను హస్తిన’కు అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో తారక్ ఢీ కొట్టబోయే విలన్ గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నారంటూ ఫిలిం నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. అలాగే దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీలోనూ విలన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. దాంతో తారక్‌తో పోటీ పడటానికి సేతుపతే సరైనోడు అని గురూజీ భావిస్తున్నాడట. నటనలోనూ ఇద్దరూ ఒకరిని మించిన వారు ఒకరు. దాంతో ఎన్టీఆర్ సినిమాకు విజయ్ సేతుపతే విలన్‌గా సెట్ అవుతాడని త్రివిక్రమ్ అనుకుంటున్నారని టాక్. ఇక నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే సేతుపతి సరే అంటాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఈ వార్తపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!