
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ రణబాలి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు కూడా పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెడుతోంది. నవంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో రణబాలి సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన రణబాలి ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. నవంబర్ 13 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
రణబాలి సినిమాను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. పెళ్లి తర్వాత ఈ జంట కలిసి నటించిన చిత్రంగా రణబాలిపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
బ్రిటీష్ వలస పాలన కాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంతో రణబాలి కథను రూపొందించారు. 19వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఓ వీరుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్, ఎమోషన్స్, చారిత్రక నేపథ్యంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు.ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. టీ-సిరీస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా కీలక పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి