Vijay Devarakonda: క్రేజీ కాంబో రిపీట్.. మరోసారి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..

|

Sep 01, 2023 | 6:40 AM

ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు లేవు. కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. యూత్ ను ఆకట్టుకునే కథతో సందీప్ రెడ్డి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.  ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్, యాటిట్యూడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు భారీగా ఆఫర్స్ వచ్చాయి.

Vijay Devarakonda: క్రేజీ కాంబో రిపీట్.. మరోసారి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..
Vijay Devarakonda Sandeep
Follow us on

విజయ్ దేవరకొండ .. ఈ పేరుకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఒకే ఒక్క సినిమా విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమానే అర్జున్ రెడ్డి. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు లేవు. కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. యూత్ ను ఆకట్టుకునే కథతో సందీప్ రెడ్డి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.  ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్, యాటిట్యూడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు భారీగా ఆఫర్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవర కొండ, సందీప్ రెడ్డి కాంబోలో మరో సినిమా రానుందని తెలుస్తోంది.

అర్జున్ రెడ్డి కాంబోపై మైత్రీ మూవీస్ అధినేత ర‌విశంక‌ర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నేడు( సెప్టెంబర్ 1న ) విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి.

ఈ సినిమాను మైత్రిమూవీ మేకర్స్ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న  మైత్రీ మూవీస్ అధినేత ర‌విశంక‌ర్ విజయ్ నెక్స్ట్ సినిమా పై క్రేజీ కామెంట్స్ చేశారు. విజయ్ తో కలిసి డియ‌ర్ కామ్రేడ్, ఖుషి సినిమాలు చేశారు.

విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.