Macherla Niyojakavargam: ‘మాచెర్ల నియోజకవర్గం’ మూవీలో వెన్నెల కిషోర్ ఇంట్రెస్టింగ్ రోల్.. ఆసక్తికర వివరాలు

|

Jul 21, 2022 | 12:21 PM

యంగ్ హీరో నితిన్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. భీష్మ సినిమా తర్వాత నితిన్ కు చెప్పుకోదగ్గ హిట్టు పడలేదు. ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు నితిన్.

Macherla Niyojakavargam: ‘మాచెర్ల నియోజకవర్గం’ మూవీలో వెన్నెల కిషోర్ ఇంట్రెస్టింగ్ రోల్.. ఆసక్తికర వివరాలు
Vennela Kishor
Follow us on

యంగ్ హీరో నితిన్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. భీష్మ సినిమా తర్వాత నితిన్ కు చెప్పుకోదగ్గ హిట్టు పడలేదు. ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు నితిన్. భీష్మ సినిమా తర్వాత నితిన్ చేసిన చెక్, రంగ్ దే , మాస్ట్రో సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. వీటిలో రంగ్ దే సినిమా పర్లేదు అనిపించుకుంది. అయితే ఇప్పుడు మాచర్ల నియోజక వర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ యంగ్ హీరో. మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం'(Macherla Niyojakavargam)కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.

ఇంట్రస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచుతున్న యూనిట్ తాజాగా ఈ చిత్రం నుండి వెన్నెల కిషోర్ పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో ‘గుంతలకడి గురునాధం’ అనే పాత్రలో కనిపించబోతున్నారు వెన్నెల కిషోర్. షార్ట్ కట్ లో గురు అనే పేరు కూడా వుంది. అంతేకాదు ఆయన పాత్రకు ‘ఇగో కా బాప్’ అనే క్యాప్షన్ ఇవ్వడం మరింత ఆసక్తికరంగా వుంది. ‘ఇగో కా బాప్’ క్యాప్షన్ కి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ లో వెన్నెల కిషోర్ చాలా సీరియస్ గా చూస్తూ ఇచ్చిన ఇగోయిస్టిక్ ఎక్స్ ప్రెషన్ ఆయన పాత్రపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తుండగా, అంజలి స్పెషల్ నంబర్ ‘రారా రెడ్డి’లో సందడి చేస్తోంది. ఇటివలే విడుదలైన లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Vennela Kishor

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి