Akira Nandan: నా తమ్ముడు సూపర్.. అకీరాకు దిష్టి పెట్టకండి.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్
పవన్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేశారు. ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు పవన్. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ ఇండస్ట్రీకి ఎప్పుడు వస్తారని ఆయన ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
పవర్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్‌కు ఇండియావైడ్‌గానే కాదు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం పవన్ ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పవన్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేశారు. ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు పవన్. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ ఇండస్ట్రీకి ఎప్పుడు వస్తారని ఆయన ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అకీరా ఇప్పుడు హీరో లుక్ లోకి మారిపోయాడు.
అకీరా ఎప్పుడు ఎప్పుడు సినిమా చేస్తాడా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే అకీరాకు నటనమీద కంటే డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అంటూ గతంలో రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే మెగా ఫ్యామిలి ఫంక్షన్స్ లో అకీరానందన్ ను చూసిన ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. అతను హీరోగా ఆవాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లిలోనూ అకీరానందన్ కనిపించాడు. తాజాగా వరుణ్ తేజ్ ను ఓ కాలేజ్ కు తన సినిమా ప్రమోషన్స్ కు వెళ్ళాడు. అక్కడ స్టూడెంట్స్ అకీరా గురించి వరుణ్ ను ప్రశ్నించారు. మీకు పవన్ కళ్యాణ్ కు ఉన్న బాడింగ్ అలాగే మీ బ్రదర్ అకీరాతో మీకున్న బాండింగ్ ఎలా ఉంటుంది అని అడిగారు స్టూడెంట్స్. దానికి వరుణ్ స్పందిస్తూ.. నా తమ్ముడితో నేను బాగుంటాను.. నా చెల్లితో నేను బాగుంటాను అని ఎవ్వరూ చెప్పుకోరు. కానీ అకీరా నా లిటిల్ బ్రదర్ మా మధ్య గొప్ప బంధం ఉంది అన్నారు వరుణ్. ప్రస్తుతం చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళాడు. వాడు చదువుకుంటున్నాడు. చిన్న కుర్రాడు ఇలాంటి సినిమా ఫంక్షన్ లో అకీరా గురించి మాట్లాడకండి దిష్టి తగులుతుంది అని అన్నారు వరుణ్. వరుణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వరుణ్ తేజ్ కామెంట్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.