Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని స్థానం సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఇప్పుడు మన మధ్య లేకపోయినా ప్రతి క్షణం ఆయనను తలుచుకుంటూనే ఉంటారు ఫ్యాన్స్. ఒకప్పుడు అందమైన ప్రేమకథలతో వరుస హిట్స్ అందుకున్న ఉదయ్ కిరణ్.. ఆ తర్వాత మానసిక ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హీరో మేనల్లుడి వీడియో నెట్టింట వైరలవుతుంది.

Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
Uday Kiran Nephew Teja

Updated on: Feb 09, 2026 | 3:05 PM

ప్రస్తుతం వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ప్రేమను పండుగలా జరుపుకునే ప్రేమికుల దినోత్సవం.. అలాగే ఈ వారమంతా ప్రేమికుల సందడితో సాగుతుంది. మరోవైపు ప్రేమను తెలిపే సినిమాలు థియేటర్లలో అలరిస్తున్నాయి. ముఖ్యంగా వాలెంటైన్ రోజున ప్రేమికుల కోసం లవ్ స్టోరీలను అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అడియన్స్ ఎక్కువగా ఆరాధించే ప్రేమకథలను ఈ వాలెంటైన్ వీక్ లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న మనసంతా నువ్వే సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మరోసారి వెండితెరపైకి ఈ సినిమా రానుంది. ఇందులో ఉదయ్ కిరణ్, రీమా సేన్, తనూ రాయ్ హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

డైరెక్టర్ వీఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీని ఎమ్.ఎస్ రాజు నిర్మించారు. ఈ సినిమాను ఇప్పుడు రీరిలీజ్ చేస్తుండడంతో ఎప్పుడెప్పుడు చుద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ ఒక వీడియో షేర్ చేశారు. ” మా మావయ్య నటించిన మనసంతా నువ్వే సినిమా 25 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ల తర్వాత కూడా మావయ్య మీద ఇంత ప్రేమ, ఆదరణ ఉంటుందని ఊహించలేదు. మనసంతా నువ్వే మ్యాజిక్ ను మళ్లీ చూసేందుకు ఫిబ్రవరి 14న థియేటర్లకు వెళ్లండి. ఈ మూవీ విడుదల సమయంలో నా వయసు 7 సంవత్సరాలు. నేను కూడా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తాను. కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన మూవీ ” అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

మనసంతా నువ్వే సినిమా 2001లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. మనసంతా నువ్వే సినిమా కంటే ముందే చిత్రం, నువ్వు నేను చిత్రాలు వరుస విజయాలను అందుకున్నాయి. అలా వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుని ఓవర్ నైట్ స్టార్ అయ్యారు ఉదయ్ కిరణ్. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 14న మరోసారి రిలీజ్ కానుంది.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..