నగరంలో ఇళయరాజా కన్‌సెర్ట్.. ఈ మళ్లింపులు తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు..

ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగనుండగా, మధ్యాహ్నం 4 గంటల నుంచే రాత్రి 11 గంటల వరకు రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. రద్దీని తగ్గించేందుకు, వాహనాల సంచారాన్ని సక్రమంగా నిర్వహించేందుకు ఈ మార్పులు చేపట్టారు.

నగరంలో ఇళయరాజా కన్‌సెర్ట్.. ఈ మళ్లింపులు తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు..
Ilayaraja

Edited By:

Updated on: Mar 28, 2026 | 6:09 PM

హైదరాబాద్ నగర ఐటీ ప్రాంతంలో ఈ సాయంత్రం ట్రాఫిక్ మార్పులు అమల్లోకి రానున్నాయి. గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత విభావరి నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగనుండగా, మధ్యాహ్నం 4 గంటల నుంచే రాత్రి 11 గంటల వరకు రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. రద్దీని తగ్గించేందుకు, వాహనాల సంచారాన్ని సక్రమంగా నిర్వహించేందుకు ఈ మార్పులు చేపట్టారు. త్రిపుల్ ఐటీ కూడలి, గచ్చిబౌలి స్టేడియం, హైదరబాద్ విశ్వవిద్యాలయం గేట్ 2 నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలను విప్రో సర్కిల్, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, నల్లగండ్ల మార్గంగా మళ్లిస్తారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె.. కానీ తన అమ్మ వల్లే ఆమె జీవితం అలా.. నటుడు మురళీ మోహన్..

ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, గౌలిదొడ్డి, క్యూ సిటీ నుంచి త్రిపుల్ ఐటీ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను విప్రో సర్కిల్, నానక్‌రామ్‌గూడ, ఔటర్ రింగ్ రోడ్‌, గచ్చిబౌలి జంక్షన్ మార్గంగా దారి మళ్లించనున్నారు. లింగంపల్లి, హెచ్‌సీయూ నుంచి గచ్చిబౌలి, కొత్తగూడ, మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనాలకు ఎస్‌ఎంఆర్‌ జంక్షన్‌, మసీద్‌బండ, బోటానికల్ జంక్షన్‌, గచ్చిబౌలి జంక్షన్‌ మార్గాలను ప్రత్యామ్నాయంగా సూచించారు. సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా పోలీసులకు సహకరించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : సీన్ సీన్‏కు గుండె ఆగిపోద్ది మావ.. క్లైమాక్స్ మాత్రం బీభత్సం.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న హారర్ సిరీస్..

Follow Us