Trivikram Srinivas: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గురూజీ.. ఎన్ని సినిమాలు లైనప్ చేశారో తెలుసా..

ఈ గ్యాప్‌ ఇచ్చింది కాదు... వచ్చింది అని ఒకప్పుడు స్టయిలిష్‌ స్టార్ చెబితే చెప్పుండొచ్చు. బట్.. ఆ డైలాగ్‌ ఒరిజినల్ పేటెంట్ మాత్రం డైరెక్టర్ త్రివిక్రమ్ దే.

Trivikram Srinivas: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గురూజీ.. ఎన్ని సినిమాలు లైనప్ చేశారో తెలుసా..
Trivikram Srinivas

Updated on: Mar 08, 2022 | 9:40 AM

Trivikram Srinivas: ఈ గ్యాప్‌ ఇచ్చింది కాదు..వచ్చింది.. అని ఒకప్పుడు స్టయిలిష్‌ స్టార్ చెబితే చెప్పుండొచ్చు. బట్.. ఆ డైలాగ్‌ ఒరిజినల్ పేటెంట్ మాత్రం డైరెక్టర్ త్రివిక్రమ్ దే. అటువంటి గురువుగారినే గ్యాప్‌ కష్టాలు వెంటాడుతున్నాయా.. కానీ… అదంటా ట్రాష్‌… అయ్యామ్‌ ఆన్‌ ది ట్రాక్ అంటున్నారు గురూజీ. భీమ్లానాయకుడికి మాటల మాంత్రికుడిగానే సరిపెట్టుకుని.. పవర్‌స్టార్‌కి పవర్‌ఫుల్‌ పంచులు రాసిపెట్టారు త్రివిక్రమ్. కాకపోతే.. లోపల ఒరిజినల్ మాత్రం అలానే వుంది అనే భరోసా అయితే కనిపిస్తూనే వుంది గురూజీ ఫ్యాన్స్‌కి. ఒకటీ రెండు కాదు నాలుగైదు సినిమాలతో సాలిడ్ లైనప్‌ క్రియేట్ చేసుకుని… దటీజ్‌ గురూజీ అనిపించుకుంటున్నారు.

ఇప్పుడు సర్కారువారి పాటతో బిజీగా వున్న సూపర్‌స్టార్‌.. ఏప్రిల్ నుంచి త్రివిక్రమ్‌ క్యాంప్‌లో చేరిపోతారు. ఈ హ్యాట్రిక్ ఎఫర్ట్‌… మహేష్‌తో పాటు త్రివిక్రమ్‌ని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో నిలబెట్టబోతోంది. ఆ వెంటనే ‘అయినను పోయి రావలె’ అంటూ తారక్‌తో పెండింగ్‌లో వున్న సినిమా మీద సిట్టింగ్ వేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తయితే… ఆ తర్వాత రాబోయే సినిమాలు గురూజీ స్టేచర్‌ని మరో లెవల్లో చూపించే చాన్సుంది. మెగాపవర్‌స్టార్‌కీ-త్రివిక్రమ్‌కీ మధ్య లాక్‌డౌన్‌ టైమ్‌లోనే స్టోరీ సిట్టింగ్స్‌ జరిగాయి. చెర్రీ- త్రివిక్రమ్ కాంబో కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీని కూడా ఎలర్ట్ చేస్తోంది. అటు… బన్నీకొచ్చిన లాంగ్ గ్యాప్‌ని అల వైకుంఠపురములో మూవీతో గ్రాండ్‌గా రీఫిల్ చేసిన త్రివిక్రమ్… మరోసారి ఐకాన్‌స్టార్‌ని డైరెక్ట్ చేయబోతున్నారు. కాకపోతే.. ఇవన్నీ ఫైనలైజ్ కావాల్సిన ప్రాజెక్ట్‌లు. డాటెడ్‌ లైన్స్ మీద సంతకాలు పడ్డమొక్కటే మిగిలింది. సో.. కింగ్‌ మేకర్‌గానే కాదు.. కింగ్‌సైజ్‌ కెరీర్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట మేన్ ఆఫ్‌ మేజిక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ జీవోపై స్పందించిన చిరంజీవి.. సీఎం జగన్‏కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్..

AP Movie Ticket Price: సినిమా టికెట్ల రేట్స్ నిర్ణయించిన ఏపీ సర్కార్.. ధరల వివరాలు ఇక్కడ చూడండి..

రాధేశ్యామ్ విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం గుడ్‏న్యూస్.. సినిమా టికెట్స్ రేట్స్ జీవో జారీ.

Loading...
Unable to load recommendations.
Follow Us