
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కోసం ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను జక్కన్న పాన్ వరల్డ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్, టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు వివిధ గెటప్స్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ రాముడిగా కనిపించనున్నాడని రాజమౌళి ఇంటి ఇచ్చేశారు. తాజాగా మరోసారి వారణాసి సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు రాజమౌళి. అలాగే ఈ సినిమా కథను కూడా చెప్పేశారు.
ఈ సినిమాను పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. దీనికి ఓ బలమైన కారణం ఉంది. సినిమాలో చూపించే ప్రపంచం చాలా పెద్దదని.. అంటార్కిటికాలో ఉండే 300 అడుగుల ఎత్తైన మంచు కొండలు, ప్రాచీన రోమ్ సామ్రాజ్యపు భారీ సైన్యాలను స్క్రీన్‌పై చూపించాలన్నా., ఆ ఇంటెన్సిటీ ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో అందించాలన్నా ఐమ్యాక్స్ స్క్రీన్ మాత్రమే కరెక్ట్ అని ఫిక్సయ్యాకే అందులోకి దిగారట జక్కన్న. అలాగే కథపై కూడా క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ఇది వారణాసిలో మొదలై.. అక్కడి నుంచి మంచుతో నిండిన అంటార్కిటికా, ఆ తర్వాత ఆఫ్రికా ఖండానికి సాగుతుంది. అంతటితో ఆగకుండా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రోమ్ కాలానికి వెళ్లి, మళ్లీ చివరగా వారణాసికి చేరుకుంటుందని అన్నారు. ఈ లొకేషన్స్ వింటుంటేనే కథ స్పాన్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది.
రాజమౌళి కామెంట్స్ తో వారణాసి సినిమాపై అంచనాలుయ డబుల్ అయ్యాయి. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్స్ వస్తారని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు ఆ రోజున మహేష్ బాబు డిఫరెంట్ గెటప్స్ ను విడుదల చేస్తారని టాక్ వినిపిస్తుంది. మహేష్ కు సంబందించిన మూడు పోస్టర్స్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. వాటిలో మహేష్ బాబు సింహంతో ఉండే ఫోటో ఉంటుందని కూడా టాక్ వినిపిస్తుంది. దీని పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి మహేష్ బర్త్ డేకి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.