Trending Song : ఏం పాట మావ ఇది.. 33 ఏళ్ల క్రితం బాక్సాఫీస్‏ను షేక్ చేసిన బాలయ్య సాంగ్.. ఇప్పటికీ కుర్రోళ్లను ఊపేస్తుంది..

ఇటీవల కాలంలో యూట్యూబ్, సోషల్ మీడియాను శాసిస్తున్నాయి తెలంగాణ ఫోక్ సాంగ్స్. సినిమా పాటల కంటే ఎక్కువగా వ్యూస్ అందుకుంటూ సత్తా చాటుతున్నాయి. కానీ కొన్ని పాటల క్రేజ్ ముందు ప్రస్తుత సాంగ్స్ సైడ్ కావాల్సిందే. అందులో బాలకృష్ణ నటించిన ఈ సూపర్ హిట్ పాట ఒకటి. దాదాపు 33 ఏళ్లుగా కుర్రాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు మావ ఈ పాటకు.

Trending Song : ఏం పాట మావ ఇది.. 33 ఏళ్ల క్రితం బాక్సాఫీస్‏ను షేక్ చేసిన బాలయ్య సాంగ్.. ఇప్పటికీ కుర్రోళ్లను ఊపేస్తుంది..
Swathilo Muthyamantha Song

Updated on: May 25, 2026 | 1:22 PM

ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్, సోషళ్ మీడియాలో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అటు సినిమా పాటలు, ఇటు ఫోక్ సాంగ్స్ రచ్చ చేస్తున్నాయి ఈ క్రమంలో దాదాపు 33 ఏళ్ల క్రితం విడుదలైన ఒక పాట మాత్రం నెట్టింట రచ్చ చేస్తుంది. ఇప్పటికీ ఈ పాటను కుర్రాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్ క్రాస్ చేస్తూ వైరల్ అవుతున్న పాట ఏంటో తెలుసా.. ? అదేనండి.. బాలకృష్ణ, రవీనా టాండన్ కాంబోలో వచ్చిన ” స్వాతిలో ముత్యమంతా ముద్దులా ముట్టుకుంది సందేవానా.. “సాంగ్. నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna), బాలీవుడ్ స్టార్ బ్యూటీ రవీనా టాండన్ (Raveena Tandon) కాంబినేషన్‌లో వచ్చిన ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘బంగారు బుల్లోడు’ (1993). రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, బాలయ్య స్టెప్పులు అప్పట్లో ఒక ఊపు ఊపాయి. కాగా, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ సినిమాలోని ఒక ఐకానిక్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌గా మారి ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, రవీనా టాండన్‌ల జోడీ కెమిస్ట్రీ , ముఖ్యంగా ‘స్వాతిలో ముత్యమంత’ (Swathilo Muthyamantha) లేదా ‘ఎన్నెట్లో చాపేసి’ వంటి వాన పాటలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. రాజ్-కోటి (Raj-Koti) సంగీత సారథ్యంలో, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర ఆలపించిన ఈ క్లాసిక్ మెలోడీలు ఇప్పటికీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నాయి. ఈ సాంగ్స్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో బాలయ్య మాస్ అండ్ ఎనర్జిటిక్ గ్రేస్, రవీనా టాండన్ గ్లామరస్ లుక్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పటి తరం కుర్రకారును సైతం ఆకట్టుకుంటున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

90ల నాటి తెలుగు సినిమా వైబ్‌ను రీక్రియేట్ చేస్తూ ఫ్యాన్స్ ఈ పాటలకు రీల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు “90స్ లవ్ సాంగ్స్ ఎప్పటికీ ప్రత్యేకం”, “బాలయ్య బాబు టైమింగ్ , రవీనా అందం అద్భుతం” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దాదాపు 33 ఏళ్లుగా స్వాతిలో ముత్యమంతా సాంగ్ కుర్రాళ్లను ఓ ఊపు ఊపేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..

బాలకృష్ణ, రవీనా టాండన్ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..

Follow Us