Thangalaan OTT: ఓటీటీలోకి విక్రమ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ తంగలాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

|

Sep 06, 2024 | 2:26 PM

ఇటీవలే డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఓటీటీకి వచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఆ సినిమానే తమిళ్ సూపర్ హిట్ మూవీ తంగలాన్ . చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ డిఫరెంట్ గెటప్ లో కనిపించాడు.

Thangalaan OTT: ఓటీటీలోకి విక్రమ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ తంగలాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Thangalaan
Follow us on

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి కేవలం నెలరోజుల గ్యాప్ లోనే వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు మరీ వారం రోజులకే ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే ఓటీటీలో కొత్త సినిమాలు చాలా సందడి చేస్తున్నాయి. ఇటీవలే డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఓటీటీకి వచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఆ సినిమానే తమిళ్ సూపర్ హిట్ మూవీ తంగలాన్ . చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ డిఫరెంట్ గెటప్ లో కనిపించాడు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.

తంగలాన్ సినిమా గత నెల 15న థియేటర్లలో విడుదలైంది. కోలార్ బంగారు గనిలో తమిళుల విషాదకర సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో నటించిన అందరూ అద్భుతంగా చేశారు. అప్పటి పరిసస్థితులకు కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు రంజిత్. అలాగే  జివి.ప్రకాష్ స్వరపరిచిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో విక్రమ్ తో పాటు పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు నటించారు. స్టూడియో గ్రీన్ ఈ సినిమా భారీ వ్యయంతో నిర్మించింది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికీ ఈ సినిమా కొని థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తంగలాన్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. సెప్టెంబర్ చివరివారంలో ఈ సినిమాను ఓటీటీలోకి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.