Thaman: మాట నిలబెట్టుకున్న తమన్.. మహేష్ బాబు అభిమాని కోసం ఏం చేశారో తెలుసా?

అభిమానులకు పూనకాలు వచ్చేలా మ్యూజిక్ వాయించడమే కాదు.. ఇబ్బందుల్లో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తాజాగా మరోసారి గొప్ప మనసును చాటుకున్నారీ సంగీత దర్శకుడు. గతంలో మహేష్ బాబు అభిమానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ..

Thaman: మాట నిలబెట్టుకున్న తమన్.. మహేష్ బాబు అభిమాని కోసం ఏం చేశారో తెలుసా?
Thaman, Mahesh Babu

Updated on: Jun 19, 2026 | 8:46 PM

సినిమాలు, సాంగ్స్ సంగతి పక్కన పెడితే తమన్ కు సామాజిక స్పృహ ఎక్కువ. కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తాడు. గతంలో ఇండియన్ ఐడల్ షోతో పాటు వివిధ టీవీ షోల వేదికగానే చాలా మందికి ఆపన్న హస్తం అందించారీ మ్యూజిక్ డైరెక్టర్. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు తమన్. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఓ అభిమానికి ఆపన్న హస్తం అందించారు. తద్వారా ఆ కుటుంబం కళ్లల్లో వెలుగులు నింపారు. వివరాల్లోకి వెళితే.. కొన్ని నెలల క్రితం రాజేశ్‌ అనే మహేష్ బాబు వీరాభిమాని తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు భార్య ఒక బాబు, పాప ఉన్నారు. రాజేష్ దీన స్థితి తెలుసుకున్న బేబీ నిర్మాత ఎస్కేఎన్ ఆ కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. అదే సమయంలో ఎస్కేఎన్ పెట్టిన ట్వీట్ కు తమన్ స్పందించారు. రాజేష్ పిల్లల చదువుకు సంబంధించి పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. వారి వివరాలను చెప్పండి’ అని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అదేంటంటే.. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ గా నిరంజన్ అనే తన చిన్నారి అభిమానిని కలిసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన తమన్.. ‘లీడర్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇదే పోస్ట్ కు మహేష్ బాబు అభిమాని ఒకరు స్పందిస్తూ.. ‘ అన్నా.. గతంలో మీరు ఇచ్చిన మాట కోసం ఎదురు చూస్తున్నా. దయచేసి సమాధానం ఇవ్వండి. ఇప్పటికే స్కూల్‌ కూడా ప్రారంభమైంది’ అని తమన్‌ను కోట్‌ చేశారు. దీనికి తమన్ వెంటనే స్పందించాడు. రాజేశ్‌ బిడ్డలు శివరామ్‌, సారికశ్రీల స్కూల్‌ ఫీజును చెల్లించి, అందుకు సంబంధించిన రశీదులను ఎక్స్‌ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అభిమాని పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించిన ఈ మ్యూజిక డైరెక్టర్ పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అఖిల్ లెనిన్, ఎన్బీకే 111, మెగా 158 వంటి భారీ బడ్జెట్ సినిమాలకు తమన్ సంగీత అందిస్తున్నారు.

తమన్ షేర్ చేసిన స్కూల్ ఫీజ్ రశీదులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us