Vijay TVK: టీవీకే అధినేత విజయ్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో..

టీవీకే అధినేత విజయ్ కు ఒక చెల్లి కూడా ఉండేదన్న విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేదు. చాలా చిన్న వయసులోనే కన్నుమూసింది. ఈ క్రమంలో ఇప్పటికీ చెల్లిని మర్చిపోలేని విజయ్ తన కూతురికి ఆ పేరు పెట్టుకుని ఆమెలోనే తనను చూసుకుంటున్నాడట.

Vijay TVK: టీవీకే అధినేత విజయ్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో..
TVK Chief Vijay

Updated on: May 04, 2026 | 6:58 PM

తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ పేరు తెగ మార్మోగుతోంది. టీవీ ఛానెల్స్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా విజయ్ నామస్మరణే వినిపిస్తోంది. ఇదే క్రమంలో విజయ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేంటంటే.. విజయ్ కు ఒక సోదరి కూడా ఉండేదన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె పేరు ‘విద్య’. కానీ ఇప్పుడు ఆమె మన మధ్యన లేదు. 1980లో జన్మించిన విద్య 1984 మే 20న ఆనారోగ్యంతో చిన్న వయసులోనే మరణించింది. ఆ సమయంలో వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందట. దీంతో నాలుగేళ్ల వయసులోనే విద్య చనిపోయింది. చెల్లి మరణంతో విజయ్‌ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. స్కూలు నుంచి వచ్చాక విజయ్‌ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడట. తనే స్నానం చేయించి అన్నం కూడా తినిపించే వాడట. అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్‌ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడట. చెల్లెలు అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్‌.. తన కూతురికి విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టుకున్నాడట. అంతేకాదు తన ప్రొడక్షన్ బ్యానర్ కు విద్యా విజయ్ ప్రొడక్షన్స్ (Vidhya-Vijay Productions) అని పేరు పెట్టాడు.

చనిపోయిన చెల్లి పేరును కొంచెం మార్చి కూతురికి పెట్టుకున్న విజయ్

ఓ సందర్భంలో తన చెల్లి గురించి ఇలా చెప్పుకొచ్చాడు విజయ్.. ‘నా జీవితంలో పెద్ద ప్రభావం మా చెల్లెలు విద్యా మరణం.. ఆ విషాదం నుంచి కోలుకోవడం చాలా కష్టమైంది.. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఆమెను దూరం చేసిన దేవుడు.. నాకు చాలా మంది చెల్లెలను అభిమానుల రూపంలో తిరిగిచ్చాడు. వారందరిలో నా చెల్లెలు రూపాన్ని ఇప్పటికీ చూసుకుంటాను’ అని బాగా ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

TVK Chief Vijay Daughter

 

చిన్నప్పుడు చెల్లి విద్యతో విజయ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us