
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించేసింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన తమన్నా.. ఇప్పుడు పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షుకులను ఆకట్టుకుంది ఈ భామ. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ తో ఆకట్టుకుంటుంది. కేవలం నటిగానే కాదు స్పెషల్ సాంగ్స్ ల్లోనూ ఊపేస్తోంది ఈ వయ్యారి. నిజం చెప్పాలంటే సినిమాలతో పోల్చుకుంటే.. స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం తమన్నా సినిమాల స్పీడ్ తగ్గించింది. అడపాదడపా సినిమాలు చేసి మెప్పిస్తుంది.
తెలుగులో చివరిగా ఓదెలు 2 సినిమా చేసింది.. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేసింది. తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఓ దర్శకుడు తనను ఇబ్బందిపెట్టారని తెలిపింది తమన్నా.. ఇంటిమేట్ సీన్స్ లో నటించమని ఓ దర్శకుడు తనను ఇబ్బందిపెట్టారని తెలిపింది తమన్నా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. దర్శకుడు ఎంత ఒత్తడి చేసిన ఆ సన్నివేశం చేయను అని చెప్పిందట.. చివరకు సన్నివేశాన్ని చేయలేదట కానీ చివరికి ఆ డైరెక్టర్ తన వద్దకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పారని తమన్నా తెలిపింది. అయితే తమన్నా నటించిన ఏ సినిమా విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది.? ఆ డైరెక్టర్ ఎవరు? ఏ హీరో సినిమా విషయంలో ఇది జరిగింది అనేది మాత్రం చెప్పలేదు తమన్నా. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..