Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ సినిమాకోసం మహేష్ అంత తీసుకుంటున్నాడా..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజాగా చిత్రం సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాకోసం మహేష్ అంత తీసుకుంటున్నాడా..!!
Mahesh

Updated on: Sep 24, 2021 | 12:26 PM

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజాగా చిత్రం సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బ్యాంకింగ్ కుంభకోణంలో ఇరుకున్న తన తండ్రిని కాపాడుకునే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్. అలాగే ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉండనున్నాయి. ఇక ఇప్పటికే దుబాయ్, గోవాలో షూటింగ్ చేసిన చిత్రయూనిట్ త్వరలో స్పెయిన్‌‌‌కు వెళ్లనున్నారని తెలుస్తుంది. సర్కారు వారి పాట షూటింగ్ మొదలు అయినప్పటి నుండి మహేష్ బాబు లుక్, అలాగే ఆయన పాత్ర గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. తాజాగా మహేష్ రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతుంది. ఈ సినిమా కోసం భారీ మొత్తంలో అందుకుంటున్నడని టాక్ నడుస్తుంది.

సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 50కోట్లవరకు వసూల్ చేస్తున్నారని అంటున్నారు. టాలీవుడ్ లో మహేష్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ తో సినిమా చేయడానికి దర్శకులంతా ఎదురుచూస్తుంటారు. ఇక సర్కారు వారి పాటను మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సర్కారు వారి పాట మూవీ టీజర్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన క్షణాల్లోనే రికార్డుల వేట మొదలు పెట్టింది. ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ ఇప్పటి వరకు 38మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌‌‌‌లో ట్రెండింగ్‌‌‌‌లో కొనసాగుతోంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది.’సంక్రాంతి’ పండుగ సందర్భంగా, జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sreeleela: టాలీవుడ్ క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న పెళ్ళిసందడి బ్యూటీ.. స్టార్ హీరో సరసన శ్రీలీల…

Anti Tobacco: ఆ యాడ్ నుంచి తప్పుకోండి.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు టొబాకో ఆర్గనైజేషన్ లేఖ..

Bigg Boss 5 Telugu: నోరే కాదు మనసు కూడా పెద్దదే.. బిగ్ బాస్ రెమ్యునరేష్‌ని క్యాన్సర్ పేషేంట్‌కు ప్రాణం పోసేందుకు ఉమాదేవి డొనేషన్

Kangana Ranaut : మాస్టర్ ప్లాన్ వేస్తున్న మేకర్స్.. కంగనా తలైవికి సీక్వెల్ రానుందా.. ?

Loading...
Unable to load recommendations.
Follow Us