Jayamma Panchayathi : ఏంటీ ఈ పంచాయితీ ..! సుమక్క సినిమా మేకింగ్ వీడియో..

|

Dec 31, 2021 | 8:31 AM

స్టార్ యాంకర్ గా బుల్లితెర పై రాణిస్తున్న సుమ ఇప్పుడు వెండితెరపైనే సత్తా చాటడానికి రెడీ అయ్యారు. గతంలో సినిమాల్లో చిన్న చిన్న పాటలో మెరిసిన సుమ ఆతరువాత సినిమాకు గ్యాప్ ఇచ్చి బుల్లితెరపై సందడి చేస్తున్నారు.

Jayamma Panchayathi : ఏంటీ ఈ పంచాయితీ ..! సుమక్క సినిమా మేకింగ్ వీడియో..
Suma
Follow us on

Jayamma Panchayathi : స్టార్ యాంకర్‌గా బుల్లితెర పై రాణిస్తున్న సుమ ఇప్పుడు వెండితెరపైనే సత్తా చాటడానికి రెడీ అయ్యారు. గతంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన సుమ ఆతరువాత సినిమాకు గ్యాప్ ఇచ్చి బుల్లితెరపై సందడి చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు జయమ్మ పంచాయితీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యాంకర్ గానే కాకుండా బుల్లితెర రియాలిటీ షోల నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు సుమ. తన మాటలతో ఆకట్టుకుంటున్న సుమ ఇప్పుడు జయమ్మగా వెండి తెరపై సందడి చేయనున్నారు. సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం.. స్క్రీన్ ప్లే.. కథ మరియు మాటలు అందించాడు. మొన్నామధ్య ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రిలీజ్ చేశారు. ఆ లుక్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.

అలాగే రీసెట్ గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ టీజర్ లో సుమ పాత్ర తీరుతెన్నులు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. డియం బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ ద్వారా తెలుస్తోంది. బలగ ప్రకాష్ నిర్మించిన ఈ సినిమా కు కీరవాణి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే చిత్ర యూనిట్ సభ్యులు ట్రైలర్ ను విడుదల చేసి సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఇక  రీసెంట్ గా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో ఆకట్టుకుంటుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: బాలీవుడ్‌లో ఆగని కరోనా ప్రకంపనలు.. వైరస్‌ బారిన పడిన బాహుబలి ‘మనోహరి’

Prabhas: డార్లింగ్‌ మనసు బంగారం.. రాధేశ్యామ్‌ ప్రీరిలీజ్‌లో గాయ పడిన అభిమానుల కోసం..

Jr.NTR: ఆ సమయంలో డిప్రెషన్‏లోకి వెళ్లాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..