Anil Ravipudi: ఆ నందమూరి హీరో నన్ను ర్యాగింగ్‌ చేసేవారు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన స్టార్‌ డైరెక్టర్‌..

| Edited By: Ravi Kiran

Feb 22, 2022 | 7:30 AM

టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత దర్శకుడిగా అపజయమెరుగని డైరెక్టర్‌ ఎవరంటే అది అనిల్‌ రావిపూడే (Anil Ravipudi)అని చెప్పవచ్చు

Anil Ravipudi: ఆ నందమూరి హీరో నన్ను ర్యాగింగ్‌ చేసేవారు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన స్టార్‌ డైరెక్టర్‌..
Anil
Follow us on

టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత దర్శకుడిగా అపజయమెరుగని డైరెక్టర్‌ ఎవరంటే అది అనిల్‌ రావిపూడే (Anil Ravipudi)అని చెప్పవచ్చు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఒక్క విజయం కూడా అందుకోలేకపోయిన ఆయన డైరెక్టర్‌గా మారిన తర్వాత మాత్రం వరుసగా సూపర్‌ హిట్లు అందుకుంటున్నాడు. పటాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌ 2, సరిలేరు నీకెవ్వరూ .. ఇలా అనిల్‌ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఎఫ్‌2 సీక్వెల్ ఎఫ్‌3 ను తెరకెక్కిస్తోన్న ఈ యంగ్‌ డైరెక్టర్‌ నందమూరి బాలకృష్టను డైరెక్ట్‌ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో కల్యాణ్‌ రామ్‌ తో కలిసి ‘పటాస్‌’ సినిమాను తెరకెక్కించాడు అనిల్‌. ఆ తర్వాత నందమూరి హీరోలతో కలిసి చేయలేదు. ఈక్రమంలో నందమూరి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) తో తనకున్న అనుబంధం గురించి తాజాగా ఓ సందర్భంలో ఇలా పంచుకున్నారు.

‘పటాస్‌ పూర్తయ్యే సమయానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఎక్కువగా మా ఆఫీస్‌కు వస్తుండేవారు. అప్పుడు ఆయన నన్ను మామూలుగా ఆడుకునేవారు కాదు. రోజూ ర్యాగింగ్‌ చేస్తుండేవారు. ర్యాగింగ్‌ అంటే బాధపెట్టడం, ఇబ్బంది పెట్టడం కాదు. బాగా అల్లరి చేసేవాళ్లు, జోక్‌ చేసేవాళ్లు. నాకు కథ చెప్పవా? అని సరదాగా అడిగేవారు. నా మొదటి సినిమానే ఇంకా రిలీజ్‌ కాదు, ఏం చెప్పాలి అని నేనంటే.. అయితే నాకు కథ చెప్పవా? అని జోవియల్‌గా మాట్లాడేవారు. ఆయనతో కలిసి ఉన్న క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు అనిల్‌. కాగా విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌లతో కలిసి ఆయన తెరకెక్కిస్తోన్న ఎఫ్‌3 మే 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Lalu Prasad Yadav: అస్వస్థతకు గురైన ఆర్జేడీ అధినేత లాలూ.. ఆస్పత్రిలో చికిత్స..

Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం..

viral video: ధైర్యం అంటే ఇదే కదా! బాతు భీకర పోరు..