తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రీసెంట్ గా అమరన్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మంచి విజయంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది. అమరన్ సినిమా 200 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉంది. అమరన్ సినిమాకు డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. సోనీ పిక్చర్స్‌తో కలిసి నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో శివకార్తికేయన్ ఆర్మీ జవానుగా నటించారు. ఆయనకు జోడీగా నటి సాయి పల్లవి నటించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దివంగత ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో శివకార్తికేయన్ అద్భుతంగా నటించారు. అలాగే సాయి పల్లవి కూడా తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ 31 సంవత్సరాల వయస్సులో భారతదేశాన్ని శత్రువుల నుండి రక్షించడానికి చేసిన త్యాగానికి దేశ అత్యున్నత పురస్కారం అశోక్ చక్రను ప్రదానం చేశారు. దివంగత ముకుంద్ భార్య ఇందు ముకుంద్ 2015 రిపబ్లిక్ డే కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు.
ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. దీంతో సినిమా విడుదలై 9 రోజులు గడుస్తున్న నేపథ్యంలో సినిమా కలెక్షన్ల సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీని ప్రకారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 195 కోట్లు వసూలు చేసింది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రాబట్టింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.