Mrunal Thakur: కుర్రాళ్ళ హార్ట్ బ్రేక్ చేసిన సీతారామం బ్యూటీ..! ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్..

సీరియల్స్ నుంచి సినిమాలోకి వచ్చిన హీరోయిన్స్‌లో మృణాల్ ఠాకూర్ ఒకరు. హిందీలో సీరియల్స్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అమ్మడు. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసి పాపులర్ అయిన ఈ చిన్నది. హిందీలో జెర్సీ సినిమా రీమేక్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Mrunal Thakur: కుర్రాళ్ళ హార్ట్ బ్రేక్ చేసిన సీతారామం బ్యూటీ..! ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్..
Mrunal Thakur
Follow us

|

Updated on: Aug 17, 2024 | 10:36 AM

ఈమధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ కూడా ప్రేమలో పడిందని తెలుస్తోంది. ఆ బ్యూటీ ఎవరో కాదు మృణాల్ ఠాకూర్. సీరియల్స్ నుంచి సినిమాలోకి వచ్చిన హీరోయిన్స్‌లో మృణాల్ ఠాకూర్ ఒకరు. హిందీలో సీరియల్స్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అమ్మడు. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసి పాపులర్ అయిన ఈ చిన్నది. హిందీలో జెర్సీ సినిమా రీమేక్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో హనురాఘవాపుడి దర్శకత్వంలో ఈ చిన్నది సీతారామం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బాబోయ్.. ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ

సీతారామం సినిమాతో ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయింది. ఆతర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ  బిజీగా మారింది. సీతారామం సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆతర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఇది కూడా చదవండి : Venu Swamy: రకుల్ కూడా భర్త నుంచి విడిపోతుంది.. ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పానన్న వేణు స్వామి

ఇక ఇప్పుడు ఈ చిన్నది క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. నిత్యం సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటో షూట్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా మృణాల్ తన ఎక్స్ (ట్విట్టర్)లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. తాజాగా తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో లవ్ సింబల్‌ని షేర్ చేసింది. దాంతో ఈ అమ్మడు ఎప్పుడూ లేనివిధంగా లవ్ సింబల్ షేర్ చేయడం ఏంటా అని అభిమానులు షాక్ అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ ఎవరితోనో ప్రేమలో పడింది.. అందుకే ఆ లవ్ సింబల్ షేర్ చేసిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా మృణాల్ ప్రేమలో పడిందా.? హీరోతో ప్రేమలో పడిందా.? లేక ఏదైనా బిజినెస్ మాన్ తో  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీని పై మృణాల్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..