sirivennela seetharama sastri: సినిమా పాటకు సిరివెన్నెల చెదిరిపోయింది! సంతాపం తెలుపుతున్న ప్రముఖులు..

Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్రి మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. సిరివెన్నెల

sirivennela seetharama sastri: సినిమా పాటకు సిరివెన్నెల చెదిరిపోయింది! సంతాపం తెలుపుతున్న ప్రముఖులు..
Sirivennela

Edited By:

Updated on: Nov 30, 2021 | 6:10 PM

Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్రి మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. సిరివెన్నెల మరణాన్ని తెలుగు చిత్రపరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్న సిరివెన్నెల ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‏ మరింత తీవ్రమవడంతో ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా  సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మహానుభావా…. చిరస్మరణీయుడా.. ఇక కనిపించవా..? మా గుండెల్లో నిద్రపోయావా..? అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు స్టార్‌ డైరెక్టర్‌ దేవా కట్టా. సిరివెన్నెల సీతారామశాస్త్రి చినపోవడం తాజాగా ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. స్వతహాగా సిరివెన్నెల కళానికి అభిమానైన దేవా కట్టా.. చాలా వేదికల మీద గురూజీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అలాంటి దేవ కట్టా.. తన అభిమాన రచయిత ఒక్కసారిగా లేడనే విషయం తెలిసి షాక్ అయ్యారు. ట్విట్టర్‌ వేదిగా ఆయనకు నివాళి అర్పించారు.

 

ఇక సిరివెన్నెల నింగికేగడంపై పలువురు సినీ సెల్రబిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే వెర్సటైల్ యాక్టర్‌ ప్రకాశ్ రాజ్‌ ట్విట్టర్‌ వేదికగా ఆయనకు నివాళి అర్పించారు.  యూ ఆర్‌ ది బెస్ట్ గురూజీ అంటూ భావోద్వేగానికి తోనయ్యారు. ‘జగమంత కుటుంబం మీది మీరు లేని ఏకాకి జీవితం మాది’ తన మనసులోని తిరుగుతున్న భావాలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు ప్రకాశ్‌ రాజ్‌.

Also Read: Sirivennela Sitarama Sastri: జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి సిరివెన్నెల..

Sirivennela Sitarama sastri Death: సిరివెన్నెల ఇకలేరు.. విషాదంలో టాలీవుడ్ ఇండస్ట్రీ..