అందమైన గాత్రంతోపాటు.. అందమైన రూపం కలగలసిన గాయానీలలో సింగర్ సునీత ఒకరు. తన గానంతో ఎంతో మంది శ్రోతలను మంత్రముగ్దులను చేయడంలో సునీత స్పెషల్. కేవలం సింగర్‌గానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది సింగర్ సునీత. అయితే ఎప్పుడూ మీడియా.. ప్రచారాలకు దూరంగా ఉండే సునీత.. రెండో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తన పర్సనల్ విషయాలను.. లెటేస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. అంతేకాదు.. కాస్త సమయం ఉన్నా. తన భర్తతోపాటు.. పిల్లలతోనూ .. కుటుంబసభ్యులతోనూ గడిపేస్తూ.. అక్కడి ఫోటోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఇక ఇటీవల నెట్టింట్లో తన అభిమానులు అడిగిన పాటలను పాడుతూ వారిని తన గానంతో ఆకట్టుకుంది సింగర్ సునీత.. తాజాగా.. తన తనయుడు ఆకాశ్ పుట్టినరోజు సందర్భంగా తన ఇన్‌స్టాలో బర్త్ డే విషెష్ తెలిపింది.
“హ్యపీ బర్త్ డే డియర్ ఆకాశ్. నీ జీవితంలో ఎంచుకున్న ప్రతిదీ మంచి జరగాలని కోరుకుంటున్న.. లవ్యూ నానా.. ఎప్పటికీ నీతోనే ఉంటాను ” అంటూ తన కొడుకుతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది సునీత. ఇక సోషల్ మీడియాలో సింగర్ తనయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఇక సునీత… ఈ ఏడాది మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Bigg Boss 5 Buzz: ప్రియాంక విషయంలో మానస్ అలా ఉంటాడు.. అసలు విషయం బయటపెట్టిన విశ్వ..