
సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో తెలిసిన విషయమే. మహిళల సమస్యలపై ఎప్పుడూ తనదైన శైలీలో స్పందిస్తూ.. అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేస్తుంటుంది. అలాగే సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులను.. వారు ఎదుర్కోంటున్న బాధలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తుంది. అంతేకాకుండా.. నెట్టింట్లో చిన్మయితో ఎంతో మంది మహిళలు తాము ఎదుర్కోంటున్న సమస్యలను.. మానసిక సంఘర్షణను పంచుకుంటూ చిన్మయి సలహాలు తీసుకుంటుంటారు. తాజాగా సింగర్ చిన్మయి తన ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్ చేసింది.
ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో హీరోయిన్ ను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అనేకమంది హీరోయిన్లు ప్రముఖులు బాదితురాలికి మద్దతుగా నిలిచారు. వారిలో మలయాళ నటి పార్వతి తిరువోత్ ఒకరు. ఈ ఘటన తర్వాత అనేక మహిళ సంఘాలతో కలసి పార్వతి ఒక పోరాటం చేసింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ పోరాటం చేయడం వలన తను అవకాశాలు.. ఉపాధి కోల్పోయాను అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది పార్వతి. తాను నటించిన సినిమాలు సూపర్ హిట్ అయినా.. అవకాశాలు రాలేదని.. అలాగే పోరాటం చేసి.. హీరోయిన్ కు మద్దతు తెలిపినందకు తనను బెదిరించారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నానని తెలిపింది. ఈ విషయంపై స్పందించింది సింగర్ చిన్మయి.
“నిజం మాట్లాడినందుకు పార్వతి వంటి మంచి నటి పని కోల్పోయింది. అలాంటి నటి, లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి తరుపున మాట్లాడటం వలన మాత్రమే పని కోల్పోయిందని చెప్పడం నిజం. చాలా మంది మహిళలు మౌనంగా ఉన్నారు. రేపిస్టులను మాత్రమే ఈ సమాజం ప్రేమిస్తుంది ” అంటూ ట్వీట్ చేసింది చిన్మయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నటుడు దీలిప్ కుమార్ అరెస్ట్ అయి బెయిల్ పై తిరిగి వచ్చాడు. తాజాగా జనవరి 18 వరకు అతడిని అరెస్ట్ చేయకూడదని ఆదేశించింది కేరళ హైకోర్టు.
Also Read: Naga Chaitanya: ఆ విషయంలో నాకు సమంతే బెస్ట్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య..
Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!
Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..