Shiva Rajkumar: సర్జరీ కోసం అమెరికాకు శివన్న.. ఇంటికి క్యూ కట్టిన హీరోలు, అభిమానులు

|

Dec 18, 2024 | 7:28 PM

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన శస్త్రచికిత్స కోసం ఆయన బుధవారం (డిసెంబర్ 18) రాత్రి అమెరికా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర, సుదీప్ సహా పలువురు ప్రముఖులు శివన్నను కలిసి ధైర్యం చెప్పారు.

Shiva Rajkumar: సర్జరీ కోసం అమెరికాకు శివన్న.. ఇంటికి క్యూ కట్టిన హీరోలు, అభిమానులు
Shiva Rajkumar
Follow us on

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. చికిత్స కోసం ఆయన ఇవాళ అమెరికాకు వెళ్లనున్నారు. శివన్న ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు వెళ్తున్నాడన్న వార్త తెలియగానే ఆయన ఇంటి ముందు పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. దీంతో బయటకు వచ్చిన నటుడు అందరినీ ఓదార్చి నవ్వుతూ మాట్లాడాడు. ఆందోళనలో ఉన్న అభిమానులకు ధైర్యం చెప్పారు. ‘నేను నమ్మకంగా ఉన్నాను. డిసెంబర్ 24న శస్త్ర చికిత్స జరగనుంది. దాని గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. తక్కువ సమయం ఉంది అయినా ఫర్వాలేదు. కానీ 35 రోజుల పాటు ఇంటి నుంచి, మన దేశానికి దూరంగా ఉంటున్నందుకు బాధగా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అభిమానులు, మీడియా అందరూ నా ఆరోగ్య కోసం ప్రార్థిస్తున్నారు. అది నాకు సంతోషాన్ని కలిగించింది. వారు నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఇచ్చారు’ అని శివరాజ్‌కుమార్ ఎమోషనల్ అయ్యారు.అంతకు ముందు స్టార్ హీరోలు ఉపేంద్ర, సుదీప్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు శివన్న ఇంటికి వచ్చారు. చాలాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు శివన్నను కలిశారు

శివరాజ్ కుమార్ చేతిలో చాలా సినిమాలున్నాయి. అయితే అనారోగ్యం కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగులకు విరామం ఇచ్చాడు. కాగా శివన్న త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా శివరాజ్ కుమార్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసి సుదీప్ షాక్ అయ్యాడట. అయితే శివన్న పాజిటివ్ ఎనర్జీతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడని సుదీప్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శివరాజ్‌కుమార్‌ చికిత్స కోసం మియామీ వెళ్లనున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవాలని కిచ్చా ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

 

కాగా త్వరలోనే సుదీప్ నటించిన ‘మాక్స్’, అలాగే ఉపేంద్ర హీరోగా నటించిన ‘యూఐ’ సినిమాలు విడుదలవుతున్నాయి. కన్నడతో పాటు పలు దక్షిణాది భాషల్లో పాన్ ఇండియా కాన్సెప్టుతో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లే ముందు ఈ రెండు సినిమాలకు శివన్న శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు.

శివన్న ఇంట్లో కిచ్చా సుదీప్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.