AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన దృశ్యం దర్శకుడి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన దృశ్యం దర్శకుడి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 12, 2026 | 7:31 PM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జూన్ 12) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. సూర్య కరుప్పు (తెలుగులో వీరభద్రుడు)తో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటే ఒక మలయాళం సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మలయాళం ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ స్టోరీ విషయానికి వస్తే.. ఇదొక పోలీస్ క్రైమ్ స్టోరీ. ఎస్సై విజయ్ కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే హత్య జరుగుతుంది. మూడో రోజే ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ కేసు, ఆపై మరికొన్ని హత్యలు.. ఇలా నగరంలో వరుసగా క్రైమ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. మరి కొత్తగా జాయిన్ అయిన విజయ్ ఈ కేసులను ఎలా హ్యాండిల్ చేశాడు? దర్యాప్తులో విజయ్ కు ఎదురైన పరిస్థితులేంటి? అన్నదే ఈ సినిమా కథ.

ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు ధృడం (Dridam). దృశ్యం చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో దర్శకుడు మార్టిన్ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు వారికి బాగా పరిచయమైన మలయాళం హీరో షేన్ నిగమ్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తెలుగు తో సహా మొత్తం ఐదు భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. వీకెండ్ లో ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారు, అందులోనూ మలయాళం సినిమా లవర్స్ కు ధృడం మూవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో ధృడం సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశా.. ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోయా..
ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశా.. ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోయా..
ఫుడ్ బిజినెస్‌లో దంపతుల అదృష్టం.. 9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం!
ఫుడ్ బిజినెస్‌లో దంపతుల అదృష్టం.. 9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం!
వచ్చేస్తున్నార్రోయ్.. బుడ్డోడిని మించిన 5గురు దేశీయ తోపులు..!
వచ్చేస్తున్నార్రోయ్.. బుడ్డోడిని మించిన 5గురు దేశీయ తోపులు..!
గ్యాంగ్రీన్ ఎలా ముప్పుగా మారుతుంది?
గ్యాంగ్రీన్ ఎలా ముప్పుగా మారుతుంది?
యువకుడి జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టిన యువతి..!
యువకుడి జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టిన యువతి..!
4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!
4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!
అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..
అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..
అందని పూలు దేవుని కర్పణం..సామెత అసలు అర్థం తెలుసా?
అందని పూలు దేవుని కర్పణం..సామెత అసలు అర్థం తెలుసా?
జాగ్రత్తపడకపోతే మీ రిటైర్మెంట్ నగదు అంతా దోచేస్తారు జాగ్రత్త..
జాగ్రత్తపడకపోతే మీ రిటైర్మెంట్ నగదు అంతా దోచేస్తారు జాగ్రత్త..
15 బంతుల్లో స్కై విధ్వంసం.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్..?
15 బంతుల్లో స్కై విధ్వంసం.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్..?
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో