AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఫైట్ అంటే నిప్పులా ఉంటారు.. అలాంటి హీరోను జీవితంలో చూడలేదు.. టాలీవుడ్ నటుడు..

సీనియర్ నటుడు విజయ రంగరాజు.. ఈ పేరు చెబితే ఈతరం ప్రేక్షకులు అంతగా గుర్తుపట్టలేరు. కానీ ఒకప్పుడు తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరో అంకితభావం, అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌ల గురించి వివరించారు. ఆ హీరోతో కలిసి తాను ఎన్నో చిత్రాల్లో నటించానని.. అయనతో తన అనుభవాలను పంచుకున్నారు. కష్టపడే తత్వాన్ని, సహనటులకు ఆయన ఇచ్చే ప్రోత్సాహాన్ని చెప్పుకొచ్చారు.

Tollywood : ఫైట్ అంటే నిప్పులా ఉంటారు.. అలాంటి హీరోను జీవితంలో చూడలేదు.. టాలీవుడ్ నటుడు..
Vijaya Rangaraju
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2026 | 5:43 PM

Share

సీనియర్ నటుడు విజయ రంగరాజు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో హిట్ చిత్రాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో తన సుదీర్ఘ అనుబంధం, ఆయన అంకితభావం, కష్టపడే తత్వం గురించి అనేక ఆసక్తికర విషయాలను వివరించారు. చిరంజీవి ఫైట్స్ పట్ల చూపించే అంకితభావం అసమానమని విజయ రంగరాజు అన్నారు. పల్లెటూరి మొనగాడు చిత్రంలో దున్నపోతులతో చేసిన ఫైట్‌ను గుర్తుచేసుకుంటూ, వందలాది దున్నపోతుల మధ్య జరిగిన ఆ ఫైట్ అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఆ సన్నివేశాల్లో చిరంజీవి ముందు జాగ్రత్తగా అంబులెన్స్‌ను సిద్ధం చేసుకునేవారని, ఐస్ ప్యాక్‌లతో గాయాలకు చికిత్స చేసుకుంటూనే షూటింగ్‌ను కొనసాగించేవారని చెప్పారు. అలాగే, లంకేశ్వరుడు చిత్రంలో దాదాపు 50 మెట్లు ఉన్న మెట్లపై ఇద్దరూ పట్టుకొని రోల్ చేసే సన్నివేశంలో ఇద్దరికీ రక్తం కారిందని, అయినా చిరంజీవి తనపై బరువు పడకుండా జాగ్రత్తగా వ్యవహరించారని వివరించారు. ఫైట్ అంటే చిరంజీవి నిప్పులా ఉంటారని, ఆయన గ్రేస్, వర్క్‌మన్‌షిప్ మరెవరికీ సాధ్యం కాదని అన్నారు.

చిరంజీవి కృషి, నిబద్ధత గురించి వివరిస్తూ, పల్లెటూరి మొనగాడు చిత్రంలో తలతో గోడ పగలగొట్టే సన్నివేశం గురించి ప్రస్తావించారు. తాను ఆలోచిస్తుండగానే చిరంజీవి తలతో గోడను పగలగొట్టి చూపించారని, “ఇంత పర్సనాలిటీ పెట్టుకొని భయపడతావేంటి దీనికి?” అని తనను ప్రశ్నించారని గుర్తుచేసుకున్నారు. కేవలం మెగాస్టార్‌గా పేరు రావడం వెనుక ఆయన కఠోర శ్రమ ఉందని విజయ రంగరాజు స్పష్టం చేశారు. తెల్లవారుజామున 6 నుండి 7 గంటల సమయంలో చిరంజీవి ఇంటి వద్దకు వెళ్తే, ఆయన ఫైట్ ప్రాక్టీస్ చేసే శబ్దాలు వినిపిస్తాయని, కర్రసాము వంటి వాటిని అభ్యసిస్తుంటారని తెలిపారు. సినిమా అంటే సినిమా, సినిమాలో మనం శ్రమ చేస్తేనే గుర్తింపు వస్తుందని నమ్మే ఏకైక వ్యక్తి చిరంజీవి అని, అలాంటి వారు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్‌లో కూడా రారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయకాంత్, బాలయ్య బాబు వంటి ఇతర హీరోలు ఫైట్స్ చేసినప్పటికీ, చిరంజీవికి ఉండే గ్రేస్, క్రేజ్ ప్రత్యేకమని వివరించారు. డూపులు లేకుండా స్వయంగా రిస్కీ ఫైట్స్ చేయడాన్ని చిరంజీవి ఇష్టపడతారని, యముడికి మొగుడు వంటి సినిమాలకు కూడా డూప్ అవసరం లేదని ముందే చెప్పేవారని తెలిపారు.

చిరంజీవి తన సినీ కెరీర్‌కు ఎంతో మద్దతు ఇచ్చారని విజయ రంగరాజు కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు వంటి పలు చిత్రాలకు చిరంజీవే తనను సిఫార్సు చేశారని తెలిపారు. యముడికి మొగుడు సినిమా రాజ్‌కుమార్, సుధాకర్, నారాయణరావు, హరి ప్రసాద్ వంటి చిరంజీవి స్నేహితులది కావడంతో, రజనీకాంత్‌తో పనిచేసినప్పుడు పొందిన పారితోషికాన్ని డిమాండ్ చేయవద్దని, ఇది తన కోసం చేస్తున్నావని, రిస్కీ ఫైట్స్ చేయడానికి వెనుకడుగు వేయకూడదని చిరంజీవి షరతులు పెట్టి మరీ అవకాశం ఇచ్చారని చెప్పారు. ఈ సంఘటన చిరంజీవి సహనటుల పట్ల చూపించే బాండింగ్, ప్రేమను తెలియజేస్తుందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

విజయ రంగరాజు, చిరంజీవి

Vijaya Rangaraju, Chiranjee

Vijaya Rangaraju, Chiranjee

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..

Follow Us