Love Story : అందని ద్రాక్షలా శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ.. ఈ సారైనా పక్కాగా వచ్చేనా..?

|

Sep 09, 2021 | 10:50 AM

ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనుకుంటున్నా అభిమానులకు అందని ద్రాక్షగా మారింది లవ్ స్టోరీ సినిమా. ఇదిగో రిలీజ్.. అదిగో రిలీజ్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నా..

Love Story : అందని ద్రాక్షలా శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ.. ఈ సారైనా పక్కాగా వచ్చేనా..?
Love Story
Follow us on

Love Story : ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనుకుంటున్నా అభిమానులకు అందని ద్రాక్షగా మారింది లవ్ స్టోరీ సినిమా. ఇదిగో రిలీజ్.. అదిగో రిలీజ్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నా.. పక్కా క్లారిటీ మాత్రం రావడంలేదు. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన విషయం తెలిసిందే. చైతూకి జోడీగా ఫిదా భామ సాయి పల్లవి నటిస్తుంది. అందమైన ప్రేమ కథా తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, పాటలు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. దాంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాను అక్టోబర్ 10న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలనీ భావించారు. అయితే అదే రోజు నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీ వేదికగా విడుదల అవుతుంది. ఈ విషయం పై నిర్మాతలకు- థియేటర్స్ యజమానులకు మధ్య చర్చ కూడా జరిగింది. దాంతో లవ్ స్టోరీ సినిమా వెనక్కు తగ్గింది.

ఇక ఇప్పటి వరకు లవ్ స్టోరీ సినిమా రిలీజ్ పై క్లారిటీ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాను వచ్చేనెల ఫస్టువీక్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించాడు. సీనియర్ హీరోయిన్ దేవయాని కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో రావు రమేశ్ .. పోసాని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs case: : ఈడీ కార్యాలయానికి చేరుకున్న మాస్ రాజా.. రవితేజ పై కురవనున్న ప్రశ్నల వర్షం

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ పై మానస్ అసహనం.. ఓవరాక్షన్ ఎక్కువైందంటూ కామెంట్స్..

RC 15: నా కలను రామ్‌చరణ్‌ నిజం చేశాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్‌ చిరంజీవి.