Samantha Ruth Prabhu: సూపర్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న సామ్.. అమ్మడి కిట్టీలో ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే

|

Apr 03, 2022 | 7:39 PM

గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు గాని... రెగ్యులర్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనంత బిజీగా వున్నారు సమంత. చేతిలో నాలుగు, సంతకాలు చెయ్యాల్సినవి మరో రెండు.. ఇలా అరడజను సినిమాలతో టాప్‌చెయిర్‌కి పోటీ పడుతున్నారు

Samantha Ruth Prabhu: సూపర్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న సామ్.. అమ్మడి కిట్టీలో ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే
Samantha
Follow us on

గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు గాని… రెగ్యులర్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనంత బిజీగా వున్నారు సమంత(Samantha Ruth Prabhu). చేతిలో నాలుగు, సంతకాలు చెయ్యాల్సినవి మరో రెండు.. ఇలా అరడజను సినిమాలతో టాప్‌చెయిర్‌కి పోటీ పడుతున్నారు సౌత్ క్వీన్‌ సమంత. లేటెస్ట్‌గా సామ్ గురించి వినిపిస్తున్న మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఊ అంటావా పాటతో దేశం మొత్తాన్ని ఊపేసిన జాను మేడమ్… అంతకుమించిన పాట మరొకటుంది అని కన్ను గీటుతున్నారు. కన్మణి-రాంబో-ఖతీజా మూవీ షూట్ పార్ట్‌ కంప్లీటైందని, చెన్నైలో లాస్ట్ సాంగ్ ఫినిష్ చేశామని, ఇది ఊ అంటావా కంటే గొప్పగా వస్తుందని చెబుతున్నారు డైరెక్టర్ విఘ్నేష్ శివన్.

సమంత-నయనతార కలిసి నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న రాబోతోంది. మరో రెండు సోలో సినిమాలు కూడా రెడీగా వున్నాయి సామ్ కిట్టీలో. మైథలాజికల్ డ్రామా శాకుంతలం షూటింగ్ కంప్లీట్ చేసుకుని… పోస్ట్‌ప్రొడక్షన్ స్టేజ్‌లో వుంది. త్వరలో రిలీజ్‌ డేట్ అనౌన్స్ చేస్తారు. శ్రీదేవి మూవీస్ బేనర్‌పై నిర్మిస్తున్న మరో మల్టిలింగువల్ మూవీ యశోద.. ప్రొడక్షన్ వర్క్ టాప్‌గేర్‌లో నడుస్తోంది. ఈ ఏడాదే ఈ మూడు సినిమాలూ థియేటర్లో రిలీజై సామ్ ఫ్యాన్స్‌ని ఫిదా చెయ్యబోతున్నాయి. సింగిల్ క్యాలెండర్‌లో హ్యాట్రిక్ అప్పియరెన్స్ ఇవ్వబోయే రేరెస్ట్ క్రెడిట్ సమంతకే దక్కబోతోంది మరి. అటు.. హాలీవుడ్‌ ఫిలిమ్‌ ‘ది ఎరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌’లో బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. వరుణ్‌ధావన్‌తో ఒక వెబ్‌సిరీస్‌ కూడా ఆన్‌ది వే అట. అజిత్‌కుమార్‌తో విఘ్నేష్ శివన్‌ డైరెక్ట్ చేస్తున్న మూవీలో ఒక హీరోయిన్‌గా సమంత కనిపిస్తారన్నది లేటెస్ట్ హాట్ న్యూస్. సోషల్ మీడియాలో పెయిడ్ పోస్టుల్నీ, కమర్షియల్ ఎండోర్స్‌మెంట్స్‌నీ ఒక చేత్తో లాగిస్తూనే.. మరో చేత్తో సిల్వర్‌ స్క్రీన్‌ మీద అన్ని షేడ్స్‌నీ చుట్టబెడుతూ.. రెండు చేతులా సంపాదించడమే కాదు.. సౌత్‌ టు నార్త్‌ అయ్యామ్ ఆల్‌రౌండర్‌ అంటున్నారు యాపిల్ బ్యూటీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hyderabad: లేట్ నైట్ పార్టీలో షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్.. కుషితా కల్లపు, లిషి గణేష్

Hansika Motwani : ఆవార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అసలు విషయం చెప్పిన హన్సిక..

Anasuya Bharadwaj: ఆచార్య సినిమాలో అనసూయ పాత్ర అలా ఉండనుందట.. రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటుందో తెలుసా?