Prithviraj Sukumaran: 4 గంటల షూటింగ్ కోసం 3 దేశాలు, 6 నగరాలు తిరిగిన హీరో పృథ్వీరాజ్..

సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా దూసుకుపోతున్న పృథ్వీరాజ్.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అయితే పూర్తిస్థాయి హీరోగా కాదు.. అతిథి పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి చేయనున్నాడు. బీటౌన్ హీరో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా బడే మియాన్ చోటే మియాన్. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఈమూవీ ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి.

Prithviraj Sukumaran: 4 గంటల షూటింగ్ కోసం 3 దేశాలు, 6 నగరాలు తిరిగిన హీరో పృథ్వీరాజ్..
Prithviraj Sukumaran
Follow us

|

Updated on: Apr 02, 2024 | 6:27 PM

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఓ స్థాయిలో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఇందులో ప్రభాస్ స్నేహితుడిగా కనిపించి మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సలార్ తర్వాత ఇటీవల ఆడు జీవితం సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చాడు. దాదాపు పదేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈసినిమా మార్చి 29న తెలుగు, మలయాళంలో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా దూసుకుపోతున్న పృథ్వీరాజ్.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అయితే పూర్తిస్థాయి హీరోగా కాదు.. అతిథి పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి చేయనున్నాడు. బీటౌన్ హీరో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా బడే మియాన్ చోటే మియాన్. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఈమూవీ ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి.

ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. అయితే ట్రైలర్‌లో అతని ముఖం కనిపించలేదు. అయితే ఈసినిమాలో తన ఇంట్రడ్యూస్ రోల్ చిత్రీకరించడానికి దాదాపు 3 దేశాలు, 6 నగరాలు తిరిగినట్లుగా తెలుస్తోంది. ఒక ఇంటర్వ్యూలో, పృథ్వీరాజ్ అలీ అబ్బాస్ జాఫర్‌ను ప్రశంసించాడు. అతడు ఎప్పుడూ రియల్ లొకేషన్లలో మాత్రమే షూట్ చేస్తాడని అన్నాడు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. “స్క్రిప్ట్‌ను నాకు వివరించినప్పుడు, నేను గ్రీన్ స్క్రీన్‌పై 40-50 రోజులు స్టూడియోలో చిత్రీకరించాలని అనుకున్నాను. నా ఇంట్రడక్షన్‌ సీక్వెన్స్‌ని స్కాట్‌లాండ్‌లోని గ్లెన్‌ నెవిస్‌లో చిత్రీకరించాం.

ఆ సమయంలో నేను మనాలిలో వేరే సినిమా షూటింగ్‌లో ఉన్నాను. అలా మనాలి నుంచి కులుకి కారులో వెళ్లాను. అక్కడి నుంచి చండీగఢ్‌కు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాను. అక్కడి నుంచి ముంబైకి, ఆ తర్వాత దుబాయ్‌కి, చివరకు దుబాయ్‌ నుంచి ఎడిన్‌బర్గ్‌కి వెళ్లాను. ఆ తర్వాత గ్లెన్ నెవిస్‌కు వెళ్లాను. అక్కడే దాదాపు నాలుగు గంటలు షూటింగ్ చేశాము. ఆ తర్వాత నేను ఇంతకు ముందు చేస్తున్న సినిమా షూటింగ్‌ మళ్లీ అలాగే మనాలికి చేరుకున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..