ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకునేవాళ్లకు ట్రూ ఇన్స్‌పిరేషన్ హీరో రవితేజ. క్లాప్ కొట్టే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. చిన్న చిన్న పాత్రలూ వేస్తూ.. హీరోగా మారి.. స్టార్ యాక్టర్‌గా ఎదిగాడు రవితేజ. మాస్ మహారాజ్ అనే బిరుదు అందుకున్నాడు. అతనికి సినిమా అంటే ఇష్టం. దానికి కష్టం తోడైంది. కావాల్సినంత ఆత్మస్థైర్యం ఉంది. దీంతో అతను కోరుకున్నది దక్కింది. కాగా ఈ వీకెండ్ ‘ధమాకా’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్‌కి మాంచి ధమాకా మోగించింది. హిట్ టాక్ అందుకుని కలెక్షన్స్ విషయంలో దంచికొడుతుంది.
మాస్ ఆడియెన్స్‌ను ఈ సినిమా మస్త్ మెప్పిస్తుంది. రవితేజ ఫ్యాన్స్ ఏవైతే కోరకుంటారో.. అవన్నీ ఇందులో ఉన్నాయి. స్టోరీ రొటీన్ అని టాక్ వినిపించినప్పటికీ.. ఆదరణ మాత్రం తగ్గలేదు. విడుదలైన ఫస్ట్ డే ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. వరల్డ్ వైడ్ ఫస్ట్ డే రూ.10 కోట్ల గ్రాస్ సాధించినట్లు సినిమా యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ వారం రిలీజైన 18 పేజెస్, కనెక్ట్, లాఠీ మూవీస్‌తో పోల్చితుే ‘ధమాకా’ వైపే ఆడియెన్స్ ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.
MassMaharaja @RaviTeja_offl ‘s
MASSive Box Office Rampage ?#DhamakaBlockBuster in Cinemas Now ??#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY#DhamakaFromDec23@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/pr8bQO2z2R
— People Media Factory (@peoplemediafcy) December 24, 2022
‘ధమాకా’లో శ్రీలీల నటనను కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. ఆమె అప్పీరియన్స్ బాగుందన్న టాక్ వస్తుంది. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సినిమాను నిర్మించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.