
టాలీవుడ్ స్టార్ కపుల్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒకరు. వీరిద్దరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అభిమానుల్లో ఆసక్తి నెలకొంటుంది. ముఖ్యంగా వీరి ప్రేమ, పెళ్లి గురించి తెలుసుకోవాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట.. తాజాగా రణబాలి సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సెలబ్రిటీ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’లో ఈ జంట తమ బంధానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లి ప్రపోజల్ విషయంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
షోలో భాగంగా హోస్ట్ కరణ్ జోహార్.. మీ ఇద్దరిలో ముందుగా పెళ్లి ప్రపోజ్ చేసింది ఎవరని ప్రశ్నించాడు. దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ, రష్మికే తనను పెళ్లి చేసుకుందామని అడిగిందని సరదాగా చెప్పాడు. తాను అంగీకారం తెలిపేలోపే ఆమె చాలాసార్లు అడిగి ఉంటుందని అన్నాడు. నేను ఓకే చెప్పేలోగా ఒక వందసార్లు అడిగింది అని సరదాగా అన్నాడు విజయ్. విజయ్ మాటలకూ నవ్వుకున్న రష్మిక.. తాను ఒక్కరోజో, రెండు రోజులపాటో కాదని, దాదాపు ఏడాది పాటు అతడిని పెళ్లి చేసుకుందామని అడుగుతూనే ఉన్నానని చెప్పుకొచ్చింది. దీంతో కరణ్ జోహార్ ఆశ్చర్యపోగా, విజయ్ మాత్రం తానేమీ అంత చెడ్డవాడిని కాదంటూ సరదాగా స్పందించాడు. ఆ మాటలతో షోలో నవ్వులు విరిశాయి. తమ బంధంలోని చిలిపి క్షణాలను ఈ జంట ఇలా పంచుకోవడం అభిమానులకు ఆసక్తికరంగా మారింది.
అలాగే షోలోని ర్యాపిడ్ ఫైర్ రౌండ్లోనూ రష్మిక తన సమాధానాలతో ఆకట్టుకుంది. ‘పుష్ప’ సినిమాలో తనతో కలిసి నటించిన అల్లు అర్జున్, ‘యానిమల్’ చిత్రంలో సహనటుడిగా ఉన్న రణ్‌బీర్ కపూర్‌లలో ఎవరిని ఎంచుకుంటారని కరణ్ ప్రశ్నించగా.. రష్మిక వెంటనే అల్లు అర్జున్ పేరును చెప్పింది. అదే సమయంలో రష్మికతో కాకుండా మరే ఇతర నటితో విజయ్ దేవరకొండ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని అడిగిన ప్రశ్నకు రష్మిక ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తి రేకెత్తించింది. విజయ్‌కు మరో హీరోయిన్‌తో కెమిస్ట్రీ లేదన్నట్లుగా ఆమె బదులివ్వడంతో షోలో నవ్వులు పూశాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి విజయ్ దేవరకొండ తనదైన శైలిలో మాట్లాడాడు. సంతోషకరమైన వైవాహిక జీవితానికి తన దగ్గర ఒకటే సూత్రం ఉందని, భార్య చెప్పిన మాటకు ఎప్పుడూ ఓకే చెప్పాలని సరదాగా అన్నాడు విజయ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.