Rashmika Mandanna: లక్కీ బ్యూటీ కిట్టీలో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక..

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్న ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.

Rashmika Mandanna: లక్కీ బ్యూటీ కిట్టీలో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక..
Rashmika

Updated on: Sep 25, 2021 | 5:35 PM

Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్న ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ రేస్‌లో చేరిన రష్మిక వరుసగా భారీ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఒక్కసారిగా ఈ అమ్మడు స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తెలుగు సినిమాలతోపాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటిస్తుంది రష్మిక.. ఇటీవలే తమిళ్‌‌లో స్టార్ హీరో కార్తీ నటించిన సుల్తాన్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అలాగే ఇటీవల బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.. అమితాబ్ నటిస్తున్న ఓ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది మలయాళం లోను నటించడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఓ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేస్తున్నాడు. స్వప్న సినిమా – వైజయంతీ మూవీస్ ఈ  సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొంతకాలం క్రితం రష్మికను సంప్రదించగా, రీసెంట్ గా ఓకే చెప్పిందని తెలుస్తుంది. ఈ సినిమా తెలుగులో తెరకెక్కినప్పటికీ మలయాళంలోనూ రిలీజ్ అవ్వనుంది. సో రష్మిక ఈ సినిమాతో మలయాళంలోనూ అడుగుపెట్టనుందన్నమాట..  యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమారాబోతుంది. మరో ప్రధానమైన పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించనుందట.. ఈ విషయం పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sankranti 2022 – Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..

Parineeti Chopra: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ అందాలను వలకపోస్తున్న పరిణితీ చోప్రా లేటెస్ట్ ఫొటోస్..

Mahesh Babu: మహేష్ వాడిన మొదటి మొబైల్ ఏంటో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన సూపర్ స్టార్..

Khiladi Movie: రూమర్స్‏కు చెక్ పెట్టిన ఖిలాడి చిత్రయూనిట్.. రవితేజ సినిమా గురించి ఏమన్నారంటే..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us