Rashmika Mandanna: కథ నచ్చకపోయినా హీరో కోసమే సినిమా చేసిందా..? క్లారిటీ ఇచ్చిన రష్మిక
పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది రష్మిక. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దాంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే రష్మిక ఇటీవలే వరుసగా సినిమాలు కమిట్ అయ్యింది. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో కొన్ని సినిమాలనుంచి తప్పుకుంది కూడా.. ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక కు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది రష్మిక. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దాంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే రష్మిక ఇటీవలే వరుసగా సినిమాలు కమిట్ అయ్యింది. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో కొన్ని సినిమాలనుంచి తప్పుకుంది కూడా.. ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక కు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. దీని పై రష్మిక వివరణ ఇచ్చింది. ఇంతకు ఆ వార్త ఏంటంటే..
అసలు మ్యాటర్ ఏంటంటే రష్మిక యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి ఓ సినిమా చేసింది. ఆడాళ్ళు మీకు జోహార్లు అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తిరుమల కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా చాలా మంది సీనియర్ హీరోయిన్స్ నటించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కాగా రష్మిక ఈ సినిమా కథ విని ఒప్పుకోలేదని కేవలం దర్శకుడి కోసమే సినిమా చేసిందని వార్తలు పుట్టుకొచ్చాయి.
ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా ను రష్మిక కేవలం దర్శకుడు, హీరో కోసమే చేసిందని కథ ఆమెకు నచ్చలేదని రూమర్స్ వైరల్ గా మారాయి. దాంతో రష్మిక ఈ వార్తల పై స్పందించింది. ఈ వార్తల్లోవాస్తవం లేదు అని కొట్టిపారేసింది. ఎవరు చెప్పారు మీకు..? అవ్వన్నీ వట్టి పుకార్లు మాత్రమే.. నేను కథను నమ్మే సినిమాలు చేస్తాను. అలాంటి నటీనటులతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తాను అని తెలిపింది రష్మిక మందన్న. ఇలాంటి బేస్ లెస్ వార్తలను దయచేసి నమ్మకండి. ఇప్పటికే రెమ్యునరేషన్ పెంచేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అవన్నీ అవాస్తవం అని తెలిపింది రష్మిక మందన్న.
రష్మిక మందన్న
I didn’t like the Script of #AadaluMeekuJoharlu but I Signed the Film Only Because of #KishoreTirumala and #Sharwa – #RashmikaMandanna 😟😟😟 pic.twitter.com/NR3HRDTfG6
— Govind (@Movies324) February 12, 2024
రష్మిక మందన్న ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..
Said who re? 🤷🏻♀️🤦🏻♀️ I only do films Cz I believe in the script.. and being able to work with the cast and crew has been an honour.. I wonder where all of this baseless news starts from 🤷🏻♀️🤦🏻♀️
— Rashmika Mandanna (@iamRashmika) February 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.