Rashmika Mandanna: చివరకు వారిద్దరిపై ప్రశంసలు కురిపించిన రష్మిక.. రిషబ్.. రక్షిత్ శెట్టి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Jan 20, 2023 | 9:30 PM

కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి.. దర్శకత్వంలో హీరో రక్షిత్ శెట్టి.. రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం కిరిక్ పార్టీ. ఈసినిమాతోనే కన్నడ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టింది.

Rashmika Mandanna: చివరకు వారిద్దరిపై ప్రశంసలు కురిపించిన రష్మిక.. రిషబ్.. రక్షిత్ శెట్టి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు..
Rashmika Mandanna
Follow us on

నేషనల్ క్రష్ రష్మిక.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన మిషన్ మజ్ను చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగుతోపాటు.. తమిళం, హిందీలోనూ వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పటికే బీటౌన్ లో రెండు సినిమాల్లో నటించగా..మరో చిత్రం యానిమల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే తమిళ్ స్టార్ విజయ్ దళపతి సరసన వారుసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే.. కొద్దిరోజులుగా ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. ఆమె మాట్లాడిన ప్రతి మాటపై నెట్టింట నెగిటివ్ ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో కన్నడిగుల ఆగ్రాహానికి సైతం గురైంది. దీంతో ఆమెను కన్నడలో బ్యాన్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తాజాగా తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ గురించి స్పందించింది రష్మిక.

కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి.. దర్శకత్వంలో హీరో రక్షిత్ శెట్టి.. రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం కిరిక్ పార్టీ. ఈసినిమాతోనే కన్నడ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో పరిచయం.. ప్రేమ.. ఆ తర్వాత నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. అనుహ్యంగా వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇక ఆ తర్వాత రష్మిక.. తెలుగులో వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్ గా మారింది. ఇటీవల కాంతార విజయం అనంతరం రష్మికను ఓ రిపోర్టర్ ఈ సినిమాను చూశారా అని అడగ్గా.. చూడలేదు అని చెప్పింది. దీంతో కన్నడ ప్రజల ఆచారాన్ని తెలియజేసిన సినిమా చూడలేదా అంటూ ఫైర్ అయ్యారు నెటిజన్స్. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో రష్మిక తనను కథానాయికగా పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకుండా చేతి వేళ్లతో చూపించింది. దీంతో మరోసారి రష్మిక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్స్. ఆ తర్వాత రష్మికకు రిషబ్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇవ్వడం కూడా తెలిసిందే.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రష్మిక.. రిషబ్ శెట్టి.. రక్షిత్ శెట్టి గురించి స్పందించింది. 2016లోనే తన మొదటి సినిమా కిరిక్ పార్టీతో తాను అతి పెద్ద విజయాన్ని చూశానని.. తాను ఇప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఉన్నానంటే కారణం రిషబ్, రక్షిత్ అని చెప్పుకొచ్చింది. తనకు హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తున్న సమయంలో వీరిద్దరు సహయపడ్డారని తెలిపింది. వారు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేననంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.