Vijay Deverakonda: మంటలు రేపావ్..! విజయ్ పోస్టర్ పై అందాల భామల రియాక్షన్ ఇదే..

విజయ్ అర్జున్ రెడ్డిలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కొంతకాలంగా.. ఈమధ్య సైలెంట్ గా ఉన్నాడు. ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. ఇటీవల విడుదలైన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది.

Vijay Deverakonda: మంటలు రేపావ్..! విజయ్ పోస్టర్ పై అందాల భామల రియాక్షన్ ఇదే..
Vijay Devarakonda
Follow us

|

Updated on: Aug 04, 2024 | 12:32 PM

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సాలిడ్ హిట్ కోసం విజయ్ చాలా రోజులగా ఎదురుచూస్తున్నాడు. విజయ్ అర్జున్ రెడ్డిలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కొంతకాలంగా.. ఈమధ్య సైలెంట్ గా ఉన్నాడు. ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. తాజాగా విజయ్ లేటెస్ట్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్ కెరీర్ లో 12వ సినిమా ఇది. ఈ పోస్టర్‌లో  విజయ్ రగ్డ్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

విజయ్ దేవరకొండ భారీ బడ్జెట్ చిత్రాలలో కనిపించడం చాలా తక్కువ. ఇంతకుముందు ‘లైగర్’ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ‘వీడీ 12’గా మరో భారీ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్‌లో అతని గెటప్ చాలా రగ్‌గా ఉంది. అయితే విజయ్ దేవరకొండ ఈ ఫోటోపై రష్మిక మందన్న, రాశి ఖాన్ లతోపాటు పలువురు సెలబ్రిటీలు ఫైర్ ఎమోజీని పోస్ట్ చేశారు.

విజయ్ సినిమాకు అందరూ ఆల్ ది బెస్ట్. తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్ లీకైంది. ఈ సినిమాను శ్రీలంకలో చిత్రీకరించారు. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్‌తో భాగ్యశ్రీ బోర్సే జతకట్టనుందని అంటున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘జెర్సీ’ సినిమాకు దర్శకత్వం వహించి అందరి దృష్టిని ఆకర్షించాడు గౌతమ్.

విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..
వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..
గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..
గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.