వయనాడ్ బాధితులకు రష్మిక విరాళం.. ఎంత ఇచ్చిందో తెలుసా?
TV9 Telugu
03 August 2024
కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వయనాడ్ లో కొండ చరియలు విరిగి పడి వందలాది మంది మృతి చెందారు.
ఈ ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ విషాదంపై విచారం వ్యక్తం చేస్తున్నారు
అదే సమయంలో వయనాడ్ ఘటన మృతులు, బాధిత కుటుంబాలకు తమ వంతు సాయం చేసేందుకు ముందు కొస్తున్నారు.
తాజాగా ప్రముఖ కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నా సైతం వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా కేరళ సీఎం సహాయ నిధి కోసం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది రష్మిక మందన్నా.
ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలంది రష్మిక. అలాగే ఈ విషాదం నుంచి కేరళ త్వరగా కోలుకోవాలంది.
అలాగే ఈ ఘటన నుంచి వేలాది మందిని రక్షించిన ఆర్మీ దళాలు, విపత్తు సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలిపింది రష్మిక.
కాగా అంతకు ముందు కమల్ హాసన్.. రూ.25 లక్షలు, విక్రమ్.. రూ.20 లక్షలు, సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి రూ.50 లక్షలు.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్రకటించారు.