
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఇప్పుడు ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ పంజాబ్‌లోని అమృత్ సర్‌లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో అమృతసర్ సమీపంలోని ఖాసా సరిహద్దులకు వెళ్లారు. అక్కడే విధులలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకున్నారు. వారితో ముచ్చటించడమే కాకుండా.. కలిసి భోజనం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చెర్రీ ఐఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని, రాజకీయ వ్యవస్థకు.. ప్రభుత్వ వ్యవస్థకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథాంశమని వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో చరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని సమాచారం. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఉత్తరాదిలో చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఇందులో తారక్ కొమురం భీం పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించారు.
Also Read: The Kashmir Files: ఓటీటీలోకి ది కాశ్మీర్ ఫైల్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
Upasana Konidela: గోల్డెన్ టెంపుల్లో ఉపాసన సందడి.. చరణ్‌కు బదులుగా నేనొచ్చానంటూ పోస్ట్..
Siddarth: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన సిద్ధార్థ్..