ఒకానొక టైం లో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించింది రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. వరుసగా బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. దాదాపు అందరు హీరోలతో నటించింది ఈ చిన్నది. సీనియర్ హీరో నాగార్జునతో కూడా ఈ అమ్మడు రొమాన్స్ చేసింది. క్రమంగా ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ భామ. అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఈ చిన్నది అక్కడ ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు తిరిగి టాలీవుడ్ వైపు చూస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. టాలీవుడ్ ఓ స్టార్ హీరోతో మరోసారి నటించాలని ఉందని తెలిపింది రకుల్. ఆ హీరో ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో మరోసారి నటించాలని ఉందని అంటుంది రకుల్.
బన్నీతో కలిసి రకుల్ సరైనోడు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రకుల్ బన్నీ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి నటించాలని ఆశపడుతోంది. ప్రస్తుతం రకుల్ తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. మరి అల్లు అర్జున్, రకుల్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి.