సూసేకి అగ్గిపుల్ల మాదిరి.. అంటూ పాటలో శ్రీవల్లి ఎంత ముద్దుముద్దుగా పాడుకుందో… రేపు సినిమా చూసే ఆడియన్స్ కూడా అంతే ఎగ్జయిట్ కావాలి. అప్పుడే కంటెంట్ ఎంత సేపున్నా బేఫికర్‌గా చూస్తారు ఆడియన్స్. అలా కాకుండా… ల్యాగ్‌లతో ఎపిసోడ్స్ వదిలేస్తే మాత్రం చాలా ఇబ్బందవుతుంది. ఇన్ని విషయాలు తెలిసినా… మూడు గంటల 21 నిమిషాలతో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు సుకు అనేది ఫిల్మ్ నగర్ టాక్.
మూడు గంటలకు పైగా సినిమా సాగిందంటేనే.. కథ గ్రిప్పింగ్‌గా ఉండాలి. స్క్రీన్‌ప్లేలో దూకుడు కనిపించాలి. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉండాలి. కామెడీ కడుపుబ్బ నవ్వించాలి. ఎమోషన్స్ కంటతడి పెట్టించాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఉండాలి. యాక్షన్ బ్లాక్స్ దుమ్ము రేపాలి… ఎన్నో కుదురుగా కుదిరితేనే.. కమర్షియల్‌గా అంత సేపు ఆడియన్స్‌ని మెప్పించగలిగేది.
వీటన్నిటి గురించీ మీరేం వర్రీ కాకండి.. పైసా వసూల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రిపేర్ అయి రండి.. మిగిలిందంతా మేం చూసుకుంటాం అనే మాట వినిపిస్తోంది యూనిట్ నుంచి. మూడు గంటలకు పైగా మూవీస్ మనకు కొత్తేం కాదు.. ఒకప్పుడు అలవాటైనవే… రీసెంట్‌గా యానిమల్ లాంటి మూవీస్‌తో మళ్లీ అలవాటు అవుతున్నవే… అయినా.. ఈ రన్ టైమ్ రిస్క్ అనే అంటున్నారు అనుభవజ్ఞులు. రిస్క్ చేయడం నాకు రస్క్ తిన్నంత ఈజీ అంటూ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్‌కి ప్రిపేర్ అవుతున్నారట సుక్కు మాస్టర్.
డిసెంబర్ 5న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజవుతుంది. ప్రీ సేల్ బుకింగ్స్ టాప్ లేపుతున్నాయి. ఈ చిత్రం ప్రీసేల్ బుకింగ్స్‌లోనే ఇప్పటికే రూ.60కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.